Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి   

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి   


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రిక్స్ పదిహేనో శిఖర సమ్మేళనం సందర్భం లో 2023 ఆగస్టు 24 వ తేదీ నాడు జోహాన్స్ బర్గ్ లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీ సైయద్ ఇబ్రాహిమ్ రయీసీ తో సమావేశమయ్యారు.

నేత లు ఇద్దరూ వ్యాపారం మరియు పెట్టుబడి, కనెక్టివిటీ, శక్తి మరియు ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా చర్య లు తీసుకోవడం వంటి వివిధ రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని బలపరచుకొనే పద్ధతుల పై చర్చించారు. చాబహార్ ప్రాజెక్టు సహా మౌలిక సదుపాయాల రంగం లో సహకారాన్ని త్వరిత గతి న పెంచుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. అఫ్ గానిస్తాన్ సహా ప్రాంతీయ పరిణామాల పట్ల నేత లు వారి అభిప్రాయాల ను ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు.

బ్రిక్స్ పరివారం లో చేరినందుకు అధ్యక్షుడు శ్రీ రయీసీ కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.

అధ్యక్షుడు శ్రీ రయీసీ చంద్రయాన్ మిశన్ యొక్క సాఫల్యానికి గాను ప్రధాన మంత్రి కి అభినందనల ను తెలియజేశారు. బ్రిక్స్ లో ఇరాన్ కు సభ్యత్వం అంశం లో భారతదేశం ఇచ్చిన సమర్థన కు గాను ప్రధాన మంత్రి కి ధన్యవాదాల ను కూడా ఆయన తెలియ జేశారు.

 

***