ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కు మరియు టాంజానియా కు చెందిన నేశనల్ బోర్డ్ ఆఫ్ అంకౌంటెంట్స్ అండ్ ఆడిటర్స్ (ఎన్బిఎఎ) కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) పై సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. సాంకేతిక పరిశోధన, వృత్తిపరమైన నైతిక నియమావళి, సభ్యుల నిర్వహణ, వృత్తి సంబంధమైనటువంటి అభివృద్ధి ని కొనసాగించడం, వృత్తిపరమైన మరియు మేధోపరమైన అభివృద్ధి, ప్రొఫెషనల్ అకౌంటెన్సీ ట్రైనింగ్, ఆడిట్ క్వాలిటీ మానిటరింగ్, అడ్వాన్స్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ నాలెడ్జ్ రంగాలలో పరస్పర సహకారానికి అనువైన ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయాలన్నదే ఈ ఎమ్ఒయు యొక్క ఉద్దేశం.
ప్రభావం:
ఈ ఎమ్ఒయు ఐసిఎఐ సభ్యులకు, విద్యార్థులకు మరియు ఆయా సంస్థల కు చక్కటి మేలును చేకూరడంలో పరస్పర లాభదాయకం కాగల సంబంధాన్ని ఏర్పరచగలదు. ఈ ఎమ్ఒయు ఐసిఎఐ సభ్యులకు వారి వృత్తి రీత్యా అదనపు అవకాశాలను పొందేందుకు మార్గాన్ని సుగమం చేయగలదు. ఐసిఎఐ మరియు టాంజానియా కు చెందిన ఎన్బిఎఎ ల మధ్య బలమైన కార్యాచరణపూర్వక సంబంధాలను ఈ ఎమ్ఒయు వర్ధిల్లేటట్లు చేస్తుంది.
పూర్వరంగం:
ఆఫ్రికా లో అకౌంటెన్సీ మరియు ఆడిటింగ్ వృత్తి ని అభివృద్ధి పరచడంలో ఐసిఎఐ కి మరియు ఆ సంస్థ సభ్యులకు గొప్ప అవకాశాలు ఉన్నాయి. టాంజానియా కు చెందిన ఎన్బిఎఎ తో ఐసిఎఐ అనుబంధాన్ని ఏర్పరచుకోవడమంటే టాంజానియా కేంద్రం గా పని చేస్తున్న యాజమాన్యాల ద్వారా భారతదేశపు సిఎ లకు పరోక్ష ఉపాధి కల్పన మార్గం ఏర్పడనుందన్న మాటే. ఇది ప్రస్తుతం ఆఫ్రికా లో పని చేస్తున్న భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ లకు ఒక సానుకూలమైన ప్రతిష్టను తెచ్చిపెట్టడమే కాకుండా ఆఫ్రికాలోను, టాంజానియా లోను పని చేసే ఉద్దేశం ఉన్న వారికి అవకాశాలను సృష్టించగలదు.