Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇటలీ లోని రోమ్ లో జి20 నేపథ్యం లో ఇండోనేశియా అధ్య‌క్షుడు శ్రీ జోకో విదోదో తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఇటలీ లోని రోమ్ లో జి20 నేపథ్యం లో ఇండోనేశియా అధ్య‌క్షుడు శ్రీ జోకో విదోదో తో సమావేశమైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటలీ లోని రోమ్ లో 2021 అక్టోబరు 31 న జి20 శిఖర సమ్మేళనం జరిగిన నేపథ్యం లో ఇండోనేశియా అధ్యక్షుడు శ్రీ జోకో విదోదో తో సమావేశయ్యారు.
రాబోయే సంవత్సరం లో జి20 కి ఇండోనేశియా అధ్యక్షత వహించనున్నందుకు ఆ దేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. త్రయం లో భాగం గా ఇండోనేశియా తో సన్నిహితం గా కృషి చేసేందుకు భారతదేశం సిద్ధం అంటూ ఆయన హామీ ని ఇచ్చారు.

భారతదేశం-ఇండోనేశియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తాలూకు ఇటీవలి ప్రగతి ని గురించి నేతలు ఇద్దరు చర్చలు జరిపారు. కోవిడ్-19 మహమ్మారి కాలం లో రెండు దేశాలు పరస్పరం అందజేసుకొన్న దృఢ మద్ధతు ను నేతలు ఇద్దరు ప్రశంసించడం తో పాటు, మహమ్మారి అనంతర కాలం లో తిరిగి పుంజుకొనే దిశ లో సహకరించుకోవాలనే అంశం పై అంగీకారాన్ని వ్యక్తం చేశారు. వారు ఇండో-పసిఫిక్ ప్రాంత సంబంధి సహకారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని కూడా నొక్కిచెప్పారు.

ఉభయ దేశాల మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడి ని బలపరచుకోవడానికి, ప్రజల కు, ప్రజల కు మధ్య మరింత ఎక్కువ అన్యోన్యత కు బాట ను వేయడానికి నేత లు ఇరువురు వచన బద్ధత ను వ్యక్తం చేశారు.

జల వాయు పరివర్తన పై పోరాడటం లో, మరీ ముఖ్యం గా దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన వాగ్దానాల ను కార్యాచరణ లోకి తీసుకు రావలసిన అవసరం పైన సైతం చర్చ లు చోటు చేసుకొన్నాయి.

 

***