Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయెల్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి గౌరవనీయులు లెఫ్టినెంట్ జనరల్ (రెస్) బెంజమిన్ గాంట్జ్ తో సమావేశమైన – ప్రధానమంత్రి

ఇజ్రాయెల్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి గౌరవనీయులు లెఫ్టినెంట్ జనరల్ (రెస్) బెంజమిన్ గాంట్జ్ తో సమావేశమైన – ప్రధానమంత్రి

భారతదేశంలో అధికార పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి గౌరవనీయులు లెఫ్టినెంట్ జనరల్ (రెస్) బెంజమిన్ గాంట్జ్ ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారత, ఇజ్రాయెల్ దేశాల మధ్య రక్షణ రంగంలో సహకారం వేగంగా వృద్ధి చెందడాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు.  భారతదేశంలో అభివృద్ధి మరియు సహ-ఉత్పత్తి అవకాశాల నుంచి ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి ఇజ్రాయెల్ రక్షణ రంగ సంస్థలను ప్రోత్సహించారు.