Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇజ్రాయల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

ఇజ్రాయల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

ఇజ్రాయల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

ఇజ్రాయల్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌


శ్రేష్ఠుడైన ప్ర‌ధాని శ్రీ బెంజామిన్ నెత‌న్యాహూ,

మీడియా స‌భ్యులారా,

 

ఎక్స్ లెన్సీ, మీరు అందించిన హార్దిక స్వాగ‌తానికి, మీ విలువైన స‌మ‌యం కేటాయించినందుకు, మీ అసాధార‌ణ‌మైన స్నేహ భావానికి ధ‌న్య‌వాదాలు.  నిన్న మీరు, మీ సతీమణి అందించిన అద్భుత‌మైన విందును నేను ఎంతో ఆనందించాను.  గ‌త రాత్రి మీ తోను, శ్రీ‌మ‌తి నెత‌న్యాహూ తోను నేను మాట్లాడిన స‌మ‌యంలో మీ కుటుంబం గురించి తెలుసుకోవ‌డం, ప్ర‌త్యేకించి మీ తండ్రి గారిని గురించి మీరు తెలియ‌చేసిన విష‌యాలు మీ అద్భుత‌మైన దేశంపై నా అనుభ‌వాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళాయి.  ప్ర‌తికూల‌త‌ల‌ను పురోగ‌మ‌నంగా మార్చుకోవ‌డం, న‌వ‌క‌ల్ప‌న‌ల శ‌కంలో ప‌య‌నించ‌డం, ఎన్ని అవ‌రోధాల‌నైనా ఎదుర్కొని పురోగ‌మించ‌డం ద్వారా మీరు సాధించిన విజ‌యాల‌ను భార‌తదేశం ఆరాధిస్తోంది.  ఇజ్రాయల్ లో అసాధార‌ణ‌మైన రీతిలో ప‌ర్య‌టించ‌డాన్ని  గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నాను.  ఆధునిక త‌రంలో చేస్తున్న ప్ర‌యాణంలో మ‌నం న‌డిచే బాట వేరు కావ‌చ్చు గాని.. ప్ర‌జాస్వామిక విలువ‌లు, ఆర్థిక పురోగ‌మ‌నం విష‌యంలో మ‌న న‌మ్మ‌కాలు ఒక్క‌టే.

 

మిత్రులారా,

–           మ‌న దేశాల మ‌ధ్య గ‌ల బంధాన్ని పున‌రుజ్జీవింప‌చేయ‌డం

–           మ‌న బంధంలో కొత్త అధ్యాయాన్ని ర‌చించ‌డం

–           మ‌న ఉమ్మ‌డి  భాగ‌స్వామ్యం కొత్త రంగాలకు విస్త‌రించ‌డం

ఈ ప‌ర్య‌ట‌న ల‌క్ష్యం.

 

ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను ప‌లు అంశాల‌పై నిర్మాణాత్మ‌కంగా చ‌ర్చించాం.   ద్వైపాక్షిక అవ‌కాశాలు ఉన్న విభాగాల‌కే ప‌రిమితం కాలేదు.  అంత‌ర్జాతీయ శాంతికి, సుస్థిర‌త‌కు మ‌న స‌హ‌కారం ఏ విధంగా ఉప‌యోగ‌ప‌డుతుందో కూడా చ‌ర్చించాం.  ఉమ్మ‌డి ప్రాధాన్య‌ాలు ప్ర‌తిబింబించేలా బంధాన్ని నిర్మించుకోవ‌డం, ఉభ‌య దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య దీర్ఘ‌కాలిక బంధం ఏర్ప‌డేలా చూడ‌డం మా ల‌క్ష్యం.

 

మిత్రులారా,

 

న‌వ‌క‌ల్ప‌న‌లు, నీరు, వ్య‌వ‌సాయ సాంకేతిక విజ్ఞానం రంగాలలో అగ్ర‌గామి దేశాలలో ఇజ్రాయల్ ఒక‌టి.  భార‌తదేశాన్ని అభివృద్ధి ప‌థంలో ప‌య‌నింప‌చేయ‌డం కోసం నేను ఎంచుకున్న ప్రాధాన్య‌ రంగాలలో ఇవి కూడా ఉన్నాయి.  జ‌ల‌ వ‌న‌రుల సామ‌ర్థ్యాన్ని పెంచ‌డం, నీటి పొదుపు, స్వ‌చ్ఛ‌త‌, వ్య‌వ‌సాయ ఉత్పాద‌క‌త‌ల పెంపు ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మ‌రింత లోతుగా విస్త‌రించుకోవ‌డానికి అవ‌కాశం ఉన్న కీల‌క రంగాలు అని మేం అంగీకారానికి వ‌చ్చాం.  ఈ రంగంలో ప‌ర‌స్ప‌రం మ‌రింత లాభ‌దాయ‌క‌మైన ప‌రిష్కారాలు రూపొందించి అమ‌లుప‌రిచేందుకు మ‌న శాస్త్రవేత్త‌లు, ప‌రిశోధ‌కులు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయ‌గ‌ల‌ర‌ని మేం భావిస్తున్నాం.  పారిశ్రామికాభివృద్ధి రంగంలో ప‌రిశోధ‌న కోసం 40 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల‌తో ద్వైపాక్షిక టెక్నాల‌జీ ఇన్నోవేష‌న్ ఫండ్ ను ఏర్పాటు చేయాల‌న్న మా నిర్ణ‌యం ఈ ల‌క్ష్య‌ సాధ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది.  రెండు వైపులా వాణిజ్యం, పెట్టుబ‌డుల రాకను పెంచ‌డం కూడా శ‌క్తివంత‌మైన భాగ‌స్వామ్యానికి పునాదిగా ఉంటుంద‌ని మేం గుర్తించాం.  ఈ దిశ‌గా మ‌రింత కృషి చేయాల‌ని ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను నిర్ణ‌యించాం.  ఈ ప్ర‌య‌త్నంలో ఉభ‌య దేశాల‌కు చెందిన వ్యాపార సంస్థ‌లు చొర‌వ తీసుకోవాలి.  రేపు జ‌రుగ‌నున్న సిఇఒల ఫోర‌మ్ కు మేం ఇచ్చేం సందేశం ఇదే.

 

మిత్రులారా,

భార‌త‌దేశం, ఇజ్రాయల్ లు రెండూ సంక్లిష్ట‌మైన భౌగోళిక స్వభావం గ‌ల‌వి.  ప్రాంతీయంగా శాంతికి, సుస్థిర‌త‌కు ఎదుర‌య్యే వ్యూహాత్మ‌క ముప్పు సంగతి మాకు తెలుసు.  ఇజ్రాయల్ ది కూడా అదే ప‌రిస్థితి.  వ్యూహాత్మ‌క ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించుకునేందుకు మ‌రింత క‌లిసిక‌ట్టుగా కృషి చేయాల‌ని, సైబ‌ర్ స్పేస్ తో స‌హా భిన్న విభాగాలలో పెచ్చ‌రిల్లుతున్న ఉగ్ర‌వాదం, రాడిక‌ల్ భావాల‌పై పోరాటంలో స‌హ‌క‌రించుకోవాల‌ని ప్ర‌ధాని శ్రీ నెత‌న్యాహూ, నేను నిర్ణ‌యించాం. ప‌శ్చిమాసియా ప్రాంతం గురించి కూడా చ‌ర్చించాం.  శాంతి, చ‌ర్చ‌లు, సంయ‌మ‌నం స‌త్ఫ‌లితాల‌నిస్తాయ‌ని భార‌తదేశం ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తోంది.

 

మిత్రులారా,

ఉభ‌య దేశాల ప్ర‌జ‌ల మ‌ధ్య స‌హ‌జ‌సిద్ధ‌మైన సాన్నిహిత్యం, అనుబంధం ఉంది.  భార‌తీయ సంత‌తి యూదులు ఈ బంధాన్ని గుర్తు చేస్తూ ఉంటారు.  ఉమ్మ‌డి భ‌విష్య‌త్తుకు ఇది సేతువుగా కూడా నిలుస్తుంది.  ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లో ఇజ్రాయల్ ప‌ర్యాట‌కులు భార‌తదేశాన్ని సంద‌ర్శిస్తున్నారు.  అలాగే ఉన్నత విద్య‌కు, ప‌రిశోధ‌న‌కు మీ అత్యుత్త‌మ విశ్వ‌విద్యాల‌యాల‌ను భార‌త విద్యార్థులు మ‌రింత అధిక సంఖ్య‌లో ఎంచుకుంటున్నారు.  ఈ పాత‌, కొత్త బాంధ‌వ్య‌మే మ‌న భాగ‌స్వామ్యాన్ని 21వ శ‌తాబ్దిలోకి న‌డిపించ‌గ‌లుగుతుంద‌ని నేను ప్ర‌గాఢంగా విశ్వ‌సిస్తున్నాను.

 

మిత్రులారా,

ఇజ్రాయల్ కు చెందిన‌ చారిత్ర‌క న‌గ‌రం హైఫా ఇక్క‌డ‌కు 150 కిలోమీట‌ర్ల దూరంలో  ఉంది.  ఆ న‌గ‌రంతో మా దేశానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది.  ఒకటో  ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో ఆ న‌గ‌రాన్ని శ‌త్రు సేన‌ల నుండి విముక్తం చేసే పోరాటంలో 44 మంది భార‌త సైనికులు ప్రాణ‌త్యాగం చేసిన ప్ర‌దేశం అది.  సాహ‌స‌వంతులైన భార‌త సైనికుల‌కు నివాళి అర్పించేందుకు రేపు నేను హైఫా న‌గ‌రం సంద‌ర్శించ‌బోతున్నాను.

 

శ్రేష్ఠుడైన నెత‌న్యాహూ,

ఇజ్రాయల్ లో గ‌డిపిన ఈ 24 గంట‌లూ ఉత్పాద‌కం, చిర‌స్మ‌ర‌ణీయమైన‌వి.  నేనుండ‌బోతున్న మిగ‌తా గంట‌లు కూడా అంతే ఉత్సుక‌త క‌లిగిస్తాయ‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.  మీరు సకుటుంబ స‌మేతంగా భార‌తదేశ ప‌ర్య‌ట‌న‌కు తరలిరావాల‌ని ఆహ్వానించ‌డానికి దీనిని ఒక అవ‌కాశంగా భావిస్తున్నాను.  మీ హృద‌య‌పూర్వక స్వాగ‌త స‌త్కారాల‌కు మ‌రోసారి ధ‌న్య‌వాదాలు తెలుపుతున్నాను.

 

మీకు ఇవే నా ధ‌న్య‌వాదాలు.

మీకు అనేకానేక ధ‌న్య‌వాదాలు.  షాలోమ్‌!

 

 

***