Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార  సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం

ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార  సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం


ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు.

పెచ్చుపెరుగుతున్న ద్రవ్యోల్బణం, అధిక ఆర్ధిక లోటు మరియు విధాన పరమైన పక్షవాతం వంటి సమస్య ల లో భారతదేశం చిక్కుకుపోయినప్పటి 2013-14 నాటి రోజుల నుండి ప్రస్తుతం మార్పు స్పష్టం గా కనబడుతోందని ఆయన అన్నారు.

సంశయాలకు బదులు ఆశ, అవరోధాల స్థానం లో ఆశావాదం చోటు చేసుకొన్నాయని ఆయన చెప్పారు.

2014 నాటి నుండి భారతదేశం దాదాపు గా అన్ని అంతర్జాతీయ ర్యాంకుల లో, సూచీల లో చెప్పుకోదగ్గ మెరుగుదల లను సాధించినట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

క్షేత్ర స్థాయి లో మార్పులు జరిగితేనే వెనుకబడి ఉన్న ర్యాంకుల లో మార్పు వస్తుంది. ఈ నేపథ్యం లో సులభం గా వ్యాపారం చేయడానికి అవసరమైన అనేక సూచికల లో వచ్చిన పెరుగుదల మనకు స్పష్టం గా కనబడుతోందని ఆయన చెప్పారు.

ప్రపంచ స్థాయి ఆవిష్కరణల సూచీ లో భారతదేశ ర్యాంకు 2014లో 76 గా ఉండగా 2018లో ఇది 57 కు మెరుగుపడిందని, నూతన ఆవిష్కరణల లో వచ్చిన ఈ పెరుగుదల స్పష్టం గా గోచరమవుతోందని ఆయన చెప్పారు.

2014లో వివిధ పోటీ పరిస్థితుల కు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కు మధ్య ఉన్న వ్యత్యాసాల ను గురించి ప్రధాన మంత్రి వివరించారు.

ప్రస్తుతం ఉన్న స్పర్ధ అంతా పూర్తి పారిశుధ్యం లేదా పూర్తి విద్యుదీకరణ లేదా భారీ పెట్టుబడులు వంటి అభివృద్ధి కార్యక్రమాల మీదా, చేరుకోవలసిన లక్ష్యాల మీదా ఉందని ఆయన అన్నారు.

అయితే, దీనికి విరుద్ధంగా గతంలో ఆలస్యం, అవినీతి పై పోటీ ఉండేదని చెప్పారు.

తాను వివరించిన కొన్ని పనులు భారతదేశం లో పూర్తి గా అసాధ్యమని ప్రధాన మంత్రి తీవ్రంగా విమర్శించారు.

అయితే గతం లో అసాధ్యమైనవి ఇప్పుడు సాధ్యం అయ్యాయ ని ఆయన ప్రకటించారు. భారతదేశాన్ని పరిశుభ్రమైందిగాను, అవినీతి రహితమైందిగాను మార్చడం లో, సాంకేతిక పరిజ్ఞానాన్ని బలోపేతం చేసే క్రమం లో, మరి అదేవిధం గా విచక్షణ తొలగింపు, విధానాల రూపకల్పన లో స్వేచ్ఛ వంటి విషయాల లో సాధించిన ప్రగతి ని గురించి ఆయన వివరించారు.

ఒక దశ లో ప్రభుత్వాలు అభివృద్ధి పరం గా, పేద వారికి సానుకూలం గా పనిచేయలేవన్న అపోహ ప్రాచుర్యం లో ఉండేది. అయితే భారతీయ పౌరులు దాన్ని సుసాధ్యం చేశారని అని ఆయన చెప్పారు.

2014 నుండి 2019 మధ్య కాలం లో దేశం లో సగటు వృద్ధి 7.4 శాతం గా నమోదయ్యిందని, సరాసరి ద్రవ్యోల్బణం నాలుగున్నర శాతం కంటే తక్కువగా ఉందని ఆయన అన్నారు. భారతదేశ ఆర్ధిక వ్యవస్థ సరళీకరణ అనంతరం ఏ ప్రభుత్వ కాలం లో అయినా ఇదే అత్యధిక సగటు వృద్ధి రేటు అని, ఇదే అత్యల్ప సరాసరి ద్రవ్యోల్బణం రేటు అని ఆయన తెలియజేశారు.

గత నాలుగు సంవత్సరాల లో భారతదేశాని కి అందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి, 2014 సంవత్సరాని కి ముందు ఏడు సంవత్సరాల లో అందిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కి దాదాపు సమానం గా ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. ఇది సాధించడానికి భారతదేశం పరివర్తనకు అవసరమైన సంస్కరణల ను చేపట్టవలసి వచ్చిందని ఆయన చెప్పారు. దివాలా చట్టం, జిఎస్ టి, స్థిరాస్తి చట్టం మొదలైన వాటి ద్వారా దశాబ్దాల తరబడి అధిక వృద్ధి సాధించడానికి అవసరమైన గట్టి పునాది ని వేయడం జరిగిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

భారతదేశం 130 కోట్ల మంది ఆశావహులతో కూడినది, వీరి అభివృద్ధి, పురోగతి కోసం ఏదైనా ఒకే ఒక ప్రణాళిక సరిపోదు. న్యూ ఇండియా కోసం రూపొందించిన మన ప్రణాళిక సమాజం లో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను వారి ఆర్ధిక పరిస్థితి, వారి కులం, మతం, భాషలకు అతీతంగా నెరవేరుస్తుందని ఆయన తెలియజేశారు.

న్యూ ఇండియా కోసం రూపొందించిన మన ప్రణాళిక భవిష్యత్తు సవాళ్లతో పాటు గడచిన కాలం లోని సమస్యల ను కూడా పరిష్కరించేదిగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భం గా అయన కొన్ని ఉదాహరణలను ఈ దిగువ విధం గా తెలియజేశారు.

· అతి వేగం గా నడిచే రైలు ను తయారుచేయడం తో పాటు భారతదేశం కాపలా లేని రైల్వే క్రాసింగుల ను కూడా తొలగించింది.

· శీఘ్ర గతి న ఐఐటి లు, ఎఐఐఎంఎస్ లు నెలకొల్పిన భారతదేశం దేశవ్యాప్తం గా పాఠశాలలు అన్నింటి లో టాయిలెట్ లను కూడా నిర్మించింది.

· దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీస్ ను నిర్మించిన భారతదేశం, అభ్యుదయేచ్ఛ తో ఉన్న వంద గ్రామాల శీఘ్ర అభివృద్ధి కి కూడా కృషి చేస్తోంది.

· భారతదేశం విద్యుత్తు ను ఎగుమతి చేసే దేశం గా తయారు అవుతూనే, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అంధకారం లో ఉన్న కోట్లాది గృహాలకు విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది.

సామాజిక రంగం లో చేపట్టిన సానుకూల చర్యల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ- దేశం లోని 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందిస్తోందని చెప్పారు. ఇందుకోసం దాదాపు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అంటే సుమారు వంద బిలియన్ డాలర్ల ను వచ్చే పది సంవత్సరాల లో రైతుల ఖాతాల లో జమ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.

డిజిటల్ ఇండియా, స్టార్ట్- అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇనవేట్ ఇండియా లపై దృష్టి కేంద్రీకరించడం తో అవి ఇప్పుడు మంచి ప్రతిఫలాన్ని ఇస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. భారతదేశం లో 44 శాతం స్టార్ట్- అప్ సంస్థ లు 2వ స్థాయి, 3వ స్థాయి నగరాల లోనే నమోదయ్యాయని కూడా ఆయన తెలిపారు. మన దేశాని కి ఏవి కావాలి, ఏవి అక్కరలేదు మధ్య అంతరాన్ని సాంకేతికత భర్తీ చేస్తోందని ఆయన చెప్పారు.

భారతదేశాన్ని 10 ట్రిలియన్ డాలర్ ఆర్ధిక వ్యవస్థ గల దేశం గా రూపొందించాలని, నవీకరణ యోగ్య శక్తి వనరుల రంగం లో, విద్యుత్తు వాహనాలు, ఇంధన నిలువ పరికరాల రంగాల లో భారతదేశాన్ని అంతర్జాతీయం గా ముందు నిలపాలని ప్రభుత్వం ఎదురుచూస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

**