ఇంధన రంగంలో స్వయం–సమృద్ధి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
భారతదేశం ప్రపంచంలో మూడో పెద్ద ఇంధన వినియోగ దేశంగా, మూడో పెద్ద పెట్రోల్ వినియోగ దేశంగా, మూడో పెద్ద ఎల్ పిజి వినియోగ దేశంగా, నాలుగో పెద్ద ఎల్ఎన్ జి దిగుమతిదారుగా, నాలుగో పెద్ద రిఫైనర్ గా, నాలుగో పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ గా మారిందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి శ్రీ హర్ దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్ కు ప్రధానమంత్రి స్పందిస్తూ
‘‘ఇంధన రంగంలో స్వయం–సమృద్ధికి, మరింత సుస్థిర వృద్ధి సాధనకు భారత్ కట్టుబడి ఉంది’’ అని ట్వీట్ చేశారు.
India is committed to self-reliance in energy and furthering sustainable growth. https://t.co/Eq4qe7mzlT
— Narendra Modi (@narendramodi) March 15, 2023