Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

ఇండోనేషియా అధ్యక్షునితో సంయుక్త పత్రికా సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం


గౌరవనీయ ఇండోనేషియా అధ్యక్షులునా సోదరుడు ప్రబోవో సుబియాంటో,

ఇరు దేశాల ప్రతినిధులు,

మీడియా మిత్రులారా,

నమస్కారం!

భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉందిఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగాఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణంఈ సందర్భంగాఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.

మిత్రులారా,
2018
లో నేను ఇండోనేషియాను సందర్శించినప్పుడుమేం మా భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లాంఈరోజువివిధ రంగాల్లో పరస్పర సహకారం గురించి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవోతో మేం విస్తృత చర్చలు జరిపాంరక్షణ రంగంలో మా సహకారాన్ని బలోపేతం చేయాలనిరక్షణ రంగ తయారీతో పాటు సప్లయ్ చెయిన్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని మేం నిర్ణయించుకున్నాం.

సముద్ర భద్రతసైబర్ భద్రతఉగ్రవాదాన్ని అణిచేయడం అలాగే తీవ్రవాదాన్ని నిర్మూలించడం వంటి రంగాల్లో సహకారానికి సైతం మేం ప్రాధాన్యమిచ్చాంసముద్ర భద్రతరక్షణ గురించి ఈరోజు సంతకం చేసిన ఒప్పందం నేరాల నివారణశోధనరక్షణ అలాగే సామర్థ్యాలను పెంపొందించుట వంటి రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేస్తుందిగత కొన్ని సంవత్సరాలుగామా ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందిందిఅలాగే గతేడాదిఇది 30 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటింది.

ఈ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలోబహుముఖ మార్కెట్ యాక్సెస్ట్రేడ్ బాస్కెట్ కోసం మేం చర్చించాంఈ ప్రయత్నాల్లో ప్రైవేట్ రంగం సైతం సమాన భాగస్వామిగా ఉందిఈరోజు నిర్వహించిన సీఈవో ఫోరమ్ సమావేశాన్ని అలాగే ప్రైవేట్ రంగంలో ఖరారైన ఒప్పందాలను మేం స్వాగతిస్తున్నాంఫిన్‌టెక్కృత్రిమ మేధఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా మేం నిర్ణయించాం.   

ఆరోగ్యంఆహార భద్రత రంగాల్లోమధ్యాహ్న భోజన పథకంప్రజా పంపిణీ వ్యవస్థల నుండి నేర్చుకున్న విషయాలుఅనుభవాలను భారత్ ఇండోనేషియాతో పంచుకుంటోందిఇంధనంముఖ్య ఖనిజాలుసైన్స్టెక్నాలజీఅంతరిక్షం అలాగే ఎస్‌టీఈఎమ్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో సైతం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం నిర్ణయించాంఇరు దేశాల విపత్తు నిర్వహణ అథారిటీలు సైతం సంయుక్త కార్యాచరణ కోసం కలిసి పనిచేస్తాయి.

మిత్రులారా,
భారత్ఇండోనేషియా బంధం వేల సంవత్సరాల నాటిదిరామాయణమహాభారతాల నుండి ప్రేరణ పొందిన కథలుబలి జాత్ర‘ మన రెండు గొప్ప దేశాల మధ్య నాటి సాంస్కృతికచారిత్రక సంబంధాలకు సజీవ సాక్ష్యాలుబౌద్ధ బోరోబుదూర్ ఆలయం తర్వాతఇప్పుడు ప్రంబనన్ హిందూ ఆలయ పరిరక్షణకు సైతం భారత్ సహకారం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది.

అదనంగా, 2025 సంవత్సరాన్ని ఇండోఆసియాన్ పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాంఇది భారత్ – ఇండోనేషియా మధ్య సాంస్కృతిక వినిమయంపర్యాటక రంగాలకు ప్రోత్సాహం అందిస్తుంది.

మిత్రులారా,
ఆసియాన్ఇండోపసిఫిక్ ప్రాంతాల్లో ఇండోనేషియా మా ముఖ్యమైన భాగస్వామిగా ఉందిఈ మొత్తం ప్రాంతంలో శాంతిభద్రతశ్రేయస్సు అలాగే నియమాల ఆధారిత జీవనాన్ని కొనసాగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయిఅంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుతమైన జలవాయు రవాణాకు భరోసా కల్పించుటకు మేం అంగీకారానికి వచ్చాం.

మా యాక్ట్ ఈజీ పాలసీలోఆసియాన్ ఐక్యంగాకేంద్ర స్థానంగా ఉండేందుకు మేం ప్రాధాన్యమిచ్చాంజీ-20, ఆసియాన్ అలాగే హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ వంటి వేదికలపై మేం కలిసి పనిచేయుటను కొనసాగించనున్నాం.
ఇప్పుడు బ్రిక్స్‌లో ఇండోనేషియా సభ్యత్వాన్ని మేం స్వాగతిస్తున్నాంఈ అన్ని వేదికల్లోగ్లోబల్ సౌత్‌ దేశాల ప్రయోజనాలుప్రాధాన్యాల కోసం మేం సమన్వయంతోపరస్పర సహకారంతో పని చేస్తాం.

గౌరవ అధ్యక్షా,

రేపటి మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీరు భారతదేశానికి రావడం మాకు ఎంతో గర్వకారణంఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఇండోనేషియా కవాతు బృందాన్ని చూడటానికి మేమంతా ఆసక్తిగా ఉన్నాంమరోసారిమీకుమీ ప్రతినిధి బృందానికి భారత్ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది.

ధన్యవాదాలు.

గమనిక – ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమేనిజానికి ఆయన హిందీలో ప్రసంగించారు

 

***