Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారతదేశానికి గర్వకారణం: ప్రధానమంత్రి


భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వచ్చిన ఇండొనేషియా అధ్యక్షుడు శ్రీ ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఆయనతో భారత – ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారుభారతదేశ యాక్ట్ ఈస్ట్ పాలసీలో ఇండోనేషియా కీలక పాత్ర పోషించిందనిబ్రిక్స్ లో ఇండోనేషియా సభ్యత్వాన్ని భారత్ స్వాగతిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు స్వాగతం పలకడం భారత్ కు గర్వకారణం.”

మనం మొదటి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడుఇండోనేషియా అతిథి దేశంగా ఉంది.  ఇప్పుడు, 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారుఈ సందర్భంగా ఆయనతో భారత్ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలోని పలు అంశాలపై చర్చించాం’’.

భద్రతరక్షణ తయారీవాణిజ్యంఫిన్ టెక్కృత్రిమ మేధస్సు తదితర రంగాల్లో భారత్ఇండోనేషియా సంబంధాలను మరింత బలోపేతం చేసే మార్గాలపై మేము చర్చించాంఆహార భద్రతఇంధనంవిపత్తు నిర్వహణ వంటి రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని చూస్తున్నాం”

భారత్ఇండోనేషియా దేశాలు  వివిధ అంతర్జాతీయ వేదికలపై కూడా పరస్పరం సహకరించుకుంటున్నాయిఇండోనేషియా మన యాక్ట్ ఈస్ట్ పాలసీకి కేంద్ర బిందువుగా ఉందిఇండోనేషియా బ్రిక్స్ లో సభ్యత్వం పొందడాన్ని మేము స్వాగతిస్తున్నాము” అని ప్రధానమంత్రి ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.

***

MJPS/SR