Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా – మిడిల్ ఈస్ట్ యూరోప్ ఇకనామిక్ కారిడర్ యొక్కసశక్తీకరణ మరియు నిర్వహణ ల కోసం భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు మధ్యసహకారం అనే అంశం లో ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్ వర్క్ అగ్రీమెంట్ కు ఆమోదాన్ని తెలియజేసినమంత్రి మండలి


ఇండియా – మిడిల్ ఈస్ట్ యూరోప్ ఇకనామిక్ కారిడర్ (ఐఎమ్‌ఇసి) యొక్క సశక్తీకరణ మరియు నిర్వహణ ల కోసం భారతదేశం గణతంత్ర ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వాని కి మధ్య ఉన్నత స్థాయి సందర్శన కాలం లో 2024 ఫిబ్రవరి 13 వ తేదీ నాడు సంతకాలు జరిగిన ఇంటర్-గవర్నమెంటల్ ఫ్రేమ్ వర్క్ అగ్రీమెంట్ (ఐజిఎఫ్ఎ) కు ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ రోజు న తెలియ జేసింది. ద్వైపాక్షిక సంబంధాల ను వృద్ధి చెందింప చేయడం తో పాటు నౌకాశ్రయాల రంగం లో, సముద్ర రంగం లో మరియు లాజిస్టిక్స్ రంగం లో ఉభయ దేశాల మధ్య సంబంధాల ను మరింత గా బలపరచడం ఐజిఎఫ్ఎ యొక్క ఉద్దేశ్యం గా ఉంది.

 

ఇండియా- మిడిల్ ఈస్ట్ యూరోప్ ఇకనామిక్ కారిడర్ (ఐఎమ్ఇసి) యొక్క అభివృద్ధి విషయం లో రాబోయే కాలం లో సంయుక్త పెట్టుబడి కి మరియు సహకారానికి సంబంధించిన అవకాశాల ను అన్వేషించాలనేటటువంటి ఉద్దేశ్యం తో ఉభయ దేశాల మధ్య సహకారాని కి అనువైన రంగాల ను ఐజిఎఫ్ఎ లో పొందుపరచడమైంది.

 

ఈ ఒప్పందం లో ఇరు దేశాల మధ్య సహకారాని కి ఒక విస్తృతమైన రూపురేఖలు ఉన్నాయి. ఈ సహకారం పరస్పర సమ్మతి తో కూడిన సముచిత సిద్ధాంతాలు, దిశానిర్దేశాలు మరియు రెండు దేశాల న్యాయాధికార పరిధుల లో భాగం గా ప్రాసంగిక నియమ నిబంధనల కు అనుగుణం గా ఒప్పందాల సంచయం పైన ఆధారపడి ఉంటుంది.

 

***