ఆరొగ్య రంగంలో సహకారానికి 2019 జూన్ 8 వ తేదీన భారత ప్రభుత్వం, రిపబ్లిక్ ఆప్ మాల్దీవుల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీతో అమలులోకి వచ్చే విధంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
కింది అంశాలలో సహకారానికి ఈ అవగాహనా ఒప్పందం వీలుకల్పిస్తుంది…..
వైద్యులు, అధికారులు, ఆరోగ్య రంగంలోని వృత్తి నిపుణులు, ఇతర నిపుణులను ఒక దేశం మరోదేశానికి పంపడం, శిక్షణ నివ్వడం
వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధన అభివృద్ధి,
ఔషధాలు, ఔషధ ఉత్పత్తుల నియంత్రణ,వీటికి సంబంధించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం
సాంక్రమిక, సాంక్రమికేతర వ్యాధులు
ఈ- హెల్త్, టెలిమెడిసిన్,
ఉభయ దేశాలూ నిర్ణయించిన మేరకు ఏ ఇతర అంశంలోనైనా సహకారం
ఇందుకు సంబంధించిన సహకారం విషయంలో మరింత వివరణనిచ్చేందుకు, ఈ అవగాహనా ఒప్పందం అమలు పర్యవేక్షణకు సంబంధించి ఒక వర్కింగ్ గ్రూప్‌ను నియమించడం జరుగుతుంది.