Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా భూటాన్ సాటిలైట్ నిజానికి భూటాన్ప్రజల తో మన విశేష సంబంధాల కు ఒక ప్రమాణం గా ఉన్నది: ప్రధాన మంత్రి


ఇండియా భూటాన్ సాటిలైట్ అనేది భూటాన్ ప్రజల తో మన కు గల విశిష్టమైనటువంటి సంబంధానికి ఒక ప్రమాణం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సంయుక్తం గా అభివృద్ధిపరచిన ఈ ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించినందుకు భూటాన్ యొక్క సమాచార సాంకేతిక విజ్ఞ‌ానం మరియు టెలికమ్ విభాగాన్ని (డిఐటిటి) మరియు ఇస్ రో ను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

ఇండియా భూటాన్ సేట్ ను ఫలప్రదం గా ప్రయోగించినందుకు రాజు యొక్క సందేశాన్ని తెలియజేస్తూ భూటాన్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జవాబిస్తూ,

 

‘‘ఇండియా భూటాన్ సేటిలైట్ నిజానికి భూటాన్ ప్రజల తో మా విశేష సంబంధాల కు ప్రమాణం గా ఉంది. సంయుక్తం గా అభివృద్ధిపరచిన ఈ ఉపగ్రహాన్ని విజయవంతం గా ప్రయోగించినందుకు నేను @dittbhutan ను మరియు @isro ను ప్రశంసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH