Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా గేట్ వ‌ద్ద క‌ర్త‌వ్య‌ప‌థ్‌ను ప్రారంభించి, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.

ఇండియా  గేట్ వ‌ద్ద క‌ర్త‌వ్య‌ప‌థ్‌ను ప్రారంభించి, నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ.


ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు  క‌ర్త‌వ్య‌ప‌థ్‌ను ప్రారంభించారు. ఒక‌ప్ప‌డు అధికారానికి కేంద్రంగా ఉన్న రాజ్ ప‌థ్ ఇప్పుడు క‌ర్త‌వ్య‌ప‌థ్ గా మారుతున్న‌ది. ఇది ప్ర‌జ‌ల యాజ‌మాన్యానికి, సాధికార‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా ఇండియా గేట్ వ‌ద్ద  నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌మంత్రి  మాట్లాడుతూ, ఆజాదికా అమృత్ మ‌హోత్స‌వ్ వేళ దేశం కొత్త స్ఫూర్తి, శ‌క్తిని పొందిందన్నారు. ఇవాళ మ‌నం గ‌తాన్ని వ‌దిలి, రేప‌టి చిత్రాన్ని కొత్త రంగుల‌తో నింపుతున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఈ కొత్త ఆరా ప్ర‌తిచోటా క‌నిపిస్తున్న‌ద‌ని, ఇది నూత‌న భార‌త‌దేశ ఆరా అని ఆయ‌న అన్నారు. గ‌తంలో రాజ్ ప‌థ్ గా పిలిచిన కింగ్స్ వే బానిస‌త్వపు  ఆన‌వాలుగా ఉండేది. ఇప్పుడు అది చ‌రిత్ర‌లో క‌లిసిపోయింది. అది ఎన్న‌టికీ క‌నిపించ‌కుండా తుడిచేశాం అని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఇవాళ క‌ర్త‌వ్య‌ప‌థ్ పేరుతో కొత్త చ‌రిత్ర సృష్టించామ‌న్నారు. ప్ర‌స్తుత స్వాతంత్ర అమృత కాలంలో మ‌రో బానిస‌త్వ చిహ్నం నుంచి విముక్తి  పొందినందుకు నేను దేశ ప్ర‌జ‌ల‌ను అభినందిస్తున్నాను అని ఆయ‌న అన్నారు .

ఇవాళ నేష‌న‌ల్ హీరో నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ భారీ విగ్ర‌హాన్నిఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేసుకోగ‌లిగామని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.  బానిస‌త్వపు రోజుల‌లో అక్క‌డ బ్రిటిష్ రాజ్ ప్ర‌తినిధి  విగ్ర‌హం ఉండేది. ఇవాళ అదే ప్ర‌దేశంలో నేతాజి సుభాష్ చంద్ర‌బోస్ విగ్ర‌హం ఏర్పాటు ద్వారా  దేశం ఆధునిక‌, బ‌ల‌మైన భార‌త్ ను నిల‌బెట్టింద‌ని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ గొప్ప‌ద‌నం గురించి గుర్తుచేసుకుంటూ ప్ర‌ధాన‌మంత్రి  ,అధికారం , వ‌న‌రుల‌కు అతీత‌మైన మ‌హోన్న‌త వ్య‌క్తి అన్నారు. ప్ర‌పంచం మొత్తం ఆయ‌న‌ను నాయ‌కుడిగా గౌర‌వించింద‌ని అన్నారు. ఆయ‌న అస‌మాన ధైర్య‌వంతుడ‌ని, ఆత్మాభిమానం క‌ల వ్య‌క్తి అని అన్నారు. ఆయ‌న‌కు త‌న‌దైన ఆలోచ‌న‌లు , దార్శ‌నిక‌త ఉన్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఆయ‌న నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ,విధానాలు క‌లిగిన వ్య‌క్తి అని ఆయ‌న అన్నారు.

ఏ దేశ‌మూత‌న అద్భుత గ‌తాన్ని మరిచి పోరాదు. భార‌త‌దేశ‌పు అద్భుత చ‌రిత్ర ప్ర‌తి భారతీయుడి ర‌క్తంలో, సంప్ర‌దాయంలో ఉంది. నేతాజీ, భార‌త‌దేశ వార‌స‌త్వం  ప‌ట్ల ఎంతో గ‌ర్వ‌ప‌డేవారు, అదే స‌మ‌యంలో  దేశాన్ని ఆధునికం చేయాలని కోరుకున్నారు. స్వాతంత్రానంత‌రం దేశం సుభాష్ బాబు మార్గాన్ని అనుస‌రించి ఉంటే దేశం ఇప్పుడు ఎంత ఎత్తులో ఉండేదో . అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు స్వాతంత్రానంత‌రం ఈ గొప్ప నాయ‌కుడిని మ‌రిచిపోయారు. ఆయ‌న ఆలోచ‌న‌లు, ఆయ‌న గుర్తుగా ఉన్న‌వాటిని ప‌ట్టించుకోలేదు అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. నేతాజీ 125వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తాను కోల్ క‌తాలో నేతాజీ నివాసాన్ని సంద‌ర్శించిన విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ సంద‌ర్భంగా తాను పొందిన శ‌క్తిని ఆయన ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు. నేతాజీ  శ‌క్తి ఇవాళ దేశానికి మార్గ‌నిర్దేశం చేసేలా తాము కృషి చేస్తున్న‌ట్టు చెప్పారు.క‌ర్త‌వ్య‌ప‌థ్‌లోని నేతాజీ విగ్ర‌హం దానికి ఒక మాధ్య‌మంగా ఉంటుందని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
గ‌త 8 సంవ‌త్స‌రాల‌లో తాము  ఒక‌దానిత‌ర్వాత ఒక‌టిగా ఇలాంటి ఎన్నో నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇవి నేతాజీ ఆలోచ‌న‌లు, క‌ల‌ల‌కు అనుగుణ‌మైన‌వని ఆయ‌న అన్నారు. అఖండ భార‌త్ కు నేతాజీ తొలి అధినేత అని అంటూ 1947లోనే ఆయ‌న అండ‌మాన్ను విముక్తి చేసి అక్క‌డ త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని ఎగుర‌వేశార‌న్నారు.  ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌బోతున్న‌ట్టుగా ఆరోజు ఆయ‌న ఊహించార‌ని అన్నారు. అజాద్ హింద్ ప్ర‌భుత్వం 75 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ఎర్ర‌కోట‌పై త్రివ‌ర్ణ‌ప‌తాకాన్ని ఎగుర‌వేసే అదృష్టం త‌న‌కు ద‌క్కిన‌పుడు  తాను వ్య‌క్తిగ‌తంగా దానిని ఫీల్ అయ్యాన‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. ఎర్ర‌కోట‌లో నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు అంకితం చేసిన మ్యూజియం గురించి కూడా ఆయ‌న మాట్లాడారు.
2019లో రిప‌బ్లిక్ డే ప‌రేడ్ లో అజాద్ హింద్ పౌజ్ కంటింజెంట్ మార్చ్‌చేయ‌డాన్ని ఆయ‌న గుర్తుచేసుకున్నారు. ఇది వారికి ఇచ్చిన గౌర‌వంగా ఆయ‌న తెలిపారు. అలాగే వారి గుర్తింపు, అండ‌మాన్ దీవుల‌తో వారి బంధం కూడా బ‌ల‌ప‌డిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

పంచ ప్రాణ్ కు దేశం క‌ట్టుబ‌డిన విష‌యాన్ని పున‌రుద్ఘాటిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇవాళ ఇండియా ఆద‌ర్శాలు,  దాని దృష్టికోణం దాని  స్వంతం అన్్నారు. ఇవాళ ఇండియా సంక‌ల్పం దాని  స్వంత‌మ‌ని,దాని ల‌క్ష్యాలు దాని స్వంత‌మ‌ని అన్నారు. ఇవాళ రాజ్‌ప‌థ్ పేరు  క‌నిపించ‌కుండా పోయి క‌ర్త‌వ్య‌పథ్ అయింద‌న్నారు. ఇవాళ 5  వ జార్జి విగ్ర‌హం స్థానంలో నేతాజీ విగ్ర‌హం వ‌చ్చి చేరింద‌న్నారు. బానిస‌మ‌న‌స్త‌త్వాన్ని  వ‌దిలించుకోవ‌డంలో ఇదే మోద‌టి ఉదాహ‌ర‌ణ కాద‌ని ఆయ‌న అన్నారు. ఇందుకు ఇదే మొద‌టిదీ, ఆఖ‌రుదీ కాద‌ని ఆయ‌న అన్నారు. మాన‌సిక స్వాతంత్రం, ఆ స్ఫూర్తిని సాధించే ల‌క్ష్యాన్ని చేరేవ‌ర‌కు ఇదొక నిరంత‌ర ప్ర‌యాణ‌మ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి నివాస రోడ్డును రేస్ కోర్స్ రోడ్ పేరు బ‌దులుగా లోక్ క‌ల్యాణ్ మార్గ్‌గా మార్చిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అలాగే స్వాతంత్ర  ఉత్స‌వాలు, బీటింగ్ రిట్రీట్ ఉత్స‌వాల స‌మ‌యంలో భార‌తీయ సంగీత వాద్యాల వాడ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విష‌యాన్నీ ఆయ‌న ప్ర‌స్తావించారు.  అలాగే భార‌తీయ నౌకాద‌ళానికి సంబంధించి వ‌ల‌స‌ కాలంనాటి ఎన్‌సైన్‌ను ఛ‌త్ర‌ప‌తి శివాజీ చిహ్నానికి మార్చిన విష‌యం ప్ర‌స్తావించారు. అలాగే జాతీయ యుద్ధ స్మార‌కం దేశ‌ఘ‌న‌త‌ను చాటిచెబుతుంద‌న్నారు.
ఈ మార్పులు కేవ‌లం గుర్తుల‌కే ప‌రిమితం కాలేద‌ని,దేశ విధానాల‌క‌కూ వ‌ర్తింప‌చేయ‌డం జ‌రిగింద‌న్నారు.  ఇవాళ దేశం  బ్రిటిష్  కాలం నుంచి ఉన్న‌ వంద‌లాది చ‌ట్టాల‌లో మార్పులు తీసుకువ‌చ్చింద‌ని అన్నారు. భార‌తీయ బ‌డ్జెట్ తేదీ ,స‌మ‌యం  విష‌యంలో బ్రిటిష్ పార్ల‌మెంట్ స‌మ‌యాన్ని ద‌శాబ్దాలుగా  పాటిస్తూ ఉండ‌గా దానిని మార్పు చేసుకున్నామ‌న్నారు. నూత‌న జాతీయ విద్యావిధానం ద్వారా దేశ యువ‌త‌ను త‌ప్ప‌నిస‌రి విదేశీ భాష‌నుంచి విముక్తిచేస్తున్నామ‌న్నారు. దీనిని బ‌ట్టి దేశ ప్ర‌జ‌జ‌ల ఆలోచ‌న , ప్ర‌వ‌ర్త‌న రెండింటినీ  బానిస మ‌న‌స్త‌త్వం నుంచి విముక్తి చేశామ‌న్నారు.
క‌ర్త‌వ్య‌ప‌థ్ అనేది కేవలం రోడ్డు, ఇటుక‌లు, రాళ్లు కాద‌ని, ఇది భార‌త‌దేశ ప్ర‌జాస్వామిక గ‌తం, అన్ని కాలాల ఆలోచ‌న‌ల‌కు  ఒక స‌జీవ తార్కాణ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. దేశ‌ప్ర‌జ‌లు ఇక్క‌డికి వ‌చ్చిన‌పుడు నేతాజీ విగ్ర‌హం, జాతీయ యుద్ధ స్మార‌కం వారికి గొప్ప ప్రేర‌ణ‌నిస్తాయ‌ని, అవి వారిలొ క‌ర్త‌వ్య‌నిష్ఠ‌ను నింపుతాయ‌ని ఆయ‌న అన్నారు.ఇందుకు భిన్నంగా గ‌తంలోని రాజ్‌ప‌థ్ బ్రిటిష్ రాజ్‌కు సంబంధించిన‌ద‌ని, వారు బార‌తీయుల‌ను బానిస‌లుగా చూశార‌న్నారు. రాజ్ ప‌థ్ నిర్మాణం, దానితో ముడిప‌డిన భావోద్వేగం బానిస‌త్వానికి గుర్తు అని, అయితే ఇవాళ అక్క‌డ‌డి నిర్మాణం మారింని, దాని స్ఫూర్తి ప‌రివ‌ర్త‌న చెందింద‌ని చెప్పారు. ఈ క‌ర్త‌వ్య ప‌థ్ మార్గం జాతీయ యుద్ధ స్మార‌కం నుంచి రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వ‌ర‌కు గల మార్గం క‌ర్త‌వ్య నిష్ఠ ప్రేర‌ణ‌ను క‌లుగ‌జేస్తుంద‌ని,ఆయ‌న అన్నారు.
 క‌ర్త‌వ్య‌ప‌థ్ పున‌ర్ అభివృద్ధిలో పాలుపంచుకున్న శ్రామికుల‌కు ప్ర‌ధాన‌మంత్రి  ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భౌతికంగా వారు ఇందులో ప‌నిచేయ‌డ‌మే కాక‌, వారి శ్ర‌మ దేశం ప‌ట్ల వారికి గ‌ల క‌ర్త‌వ్యానికి ఒక  స‌జీవ తార్కాణ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. శ్ర‌మజీవుల‌ను తాను క‌లుసుకోవ‌డం  గురించి మాట్లాడుతూ,వారి హృద‌యాల‌లో దేశ ప్ర‌తిష్ఠ‌కు సంబంధించిన క‌ల‌ల గురించి ప్ర‌శంసించారు. సెంట్ర‌ల్ విస్టా నిర్మాణంలో పాలుపంచుకున్న‌శ్ర‌మ జీవులు, వారి కుటుంబాలు రానున్న రిప‌బ్లిక్ దినోత్స‌వ ప‌రేడ్ కు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేక అతిథులుగా రానున్నారు. ఇవాళ శ్ర‌మ‌కు గౌర‌వం భించే సంప్ర‌దాయంప‌ట్ల ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు.
శ్ర‌మ‌జీవుల‌కు సంబంధించిన విధానాల‌లో , నిర్ణ‌యాల‌లో సున్నిత‌త్వం , శ్ర‌మ‌యేవ  జ‌య‌తే అనేవి దేశ మంత్రాలుగా మారుతున్నాయ‌న్నారు. కాశీ విశ్వ‌నాథ్ థామ్,విక్రాంత్‌, ప్ర‌యాగ్‌రాజ్‌కుంభ్‌ వ‌ర్క‌ర్ల‌తో త‌న స‌మావేశం గురించి ప్ర‌ధాన‌మంత్రి  ప్ర‌స్తావించారు. కొత్త‌పార్లమెంట్ భ‌వ‌న నిర్మాణంలో ప‌నిచేస్తున్న కార్మికుల కు  ఒక గాల‌రీలో వారికి  గౌర‌వస్థానం క‌ల్పిస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఇండియా ప్ర‌స్తుతం సాంస్కృతిక మౌలిక స‌దుపాయాల‌పై ప‌నిచేస్తున్న‌ద‌ని, భౌతిక డిజిట‌ల్‌, ర‌వాణా మౌలిక‌సదుపాయాల క‌ల్ప‌న‌పై కృషిచేస్తున్న‌ద‌ని అన్నారు. సామాజిక మౌలిక స‌దుపాయాల విష‌యంలో కొన్ని ఉదాహ‌ర‌ణ‌లిస్తూ ఆయ‌న‌, ఎయిమ్స్ , మెడిక‌ల్ కాలేజీలు, ఐఐటిలు, నీటి క‌నెక్ష‌న్లు, అమృత్ స‌రోవ‌ర్ ల గురించి ప్ర‌స్తావించారు. గ్రామీణ రోడ్లు, రికార్డు సంఖ్య‌లో ఆధునిక ఎక్స్‌ప్రెస్ మార్గాలు, రైల్వేలు, మెట్రో నెట్‌వ‌ర్క్‌లు, నూత‌న విమానాశ్ర‌యాలు, పెద్ద ఎత్తున ర‌వాణా మౌలిక‌స‌దుపాయాల క‌ల్ప‌న గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. పంచాయ‌తీలకు ఆప్టిక‌ల్ ఫైబ‌ర్‌, డిజిట‌ల్ పేమెంట్ రికార్డుల వంటివి ఇండియా డిజిట‌ల్ మౌలిక‌స‌దుపాయాలు అంత‌ర్జాతీయ ప్ర‌శంస‌ల‌కు పాత్ర‌మౌతున్నాయ‌న్నారు. సాంస్కృతిక మౌలిక‌స‌దుపాయాల గురించి ప్ర‌స్తావిస్తూ, వివిధ విశ్వాసాల‌తో ముడిప‌డిన ప్ర‌దేశాల మౌలిక‌స‌స‌దుపాయాలుగా మాత్ర‌మేకాక‌, ఇవి మ‌న చ‌రిత్ర ,మ‌న దేశ వీరులు, జాతీయ వార‌స‌త్వానికి సంబంధించిన‌విగా ప్ర‌ధాని తెలిపారు. ఇలాంటి ప్రాంతాల‌ను స‌త్వ‌ర ప్రాతిప‌దిక‌న చేప‌డుతున్న‌ట్టుచెప్పారు. అది స‌ర్దార్‌ప‌టేల్ ఐక్య‌తా విగ్ర‌హం కానీ, లేదా గిరిజ‌న పోరాట‌యోధుల  పేరున వారికి అంకితం చేసిన  మ్యూజియం కానీ లేదా బాబా సాహెబ్ అంబేడ్క‌ర్ స్మార‌కం, జాతీయ యుద్ధ స్మార‌కం, లేదా జాతీయ పోలీసు  మెమోరియ‌ల్ ఇవ‌న్నీ మ‌న సాంస్కృతిక వార‌స‌త్వ మౌలిక‌స‌దుపాయాల‌న్నారు. ఇవి ఒక దేశంగా మ‌న సంస్కృతిని ప్ర‌తిబింబిస్తాయ‌న్నారు. ఇవి మ‌నం విలువ‌ల‌ను తెలియజేయ‌డంతోపాటు, మ‌నం వాటిని ఎలా కాపాడుతున్నామో ఇవి తెలియ‌జేస్తాయ‌న్నారు.
ఆకాంక్షిత భార‌త‌దేశం, సామాజిక  మౌలిక  స‌దుపాయ‌యాలకు, ర‌వాణా మౌలిక స‌దుపాయాల‌కు, డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల‌కు, సాంస్కృతిక మౌలిక‌స‌దుపాయాలు పెద్ద‌పీట  వేయ‌డం ద్వారా అద్బుత ప్ర‌గ‌తి సాధించ‌గ‌ల‌ద‌ని  అన్నారు. ఇవాళ క‌ర్త‌వ్య‌ప‌థ్ పేరుతో మ‌రో గొప్ప సాంస్కృతిక మౌలిక‌స‌దుపాయం దేశంలో అందుబాటులోకి  వ‌స్తున్న‌ద‌ని ప్ర‌ధానమంత్రి అన్నారు.

త‌న ప్ర‌సంగాన్ని ముగిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ నూత‌నంగా నిర్మించిన క‌ర్త‌వ్య‌ప‌థ్‌ను దీని గొప్ప‌త‌నాన్ని ద‌ర్శించాల్సిందిగా పిలుపునిచ్చారు.దీని అభివృద్ధిలో మీరు భవిష్య‌త్ భార‌త‌దేశాన్ని ద‌ర్శించ‌గ‌లుగుతారు. ఇక్క‌డి శ‌క్తి మీకు ఈ సువిశాల దేశానికి సంబంధించిన కొత్త దార్శ‌నిక‌త‌ను ఇస్తుంది.కొత్త న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుందని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. రాగ‌ల మూడు రోజుల పాటు నేతాజీ జీవితంపై ప్ర‌ద‌ర్శించే డ్రోన్ షో గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. పౌరులు  ఈ ప్రాంతాన్ని దర్శించి త‌మ ఫోటోల‌ను హాష్‌టాగ్ క‌ర్త‌వ్య‌ప‌థ్ పై సోష‌ల్ మీడియాద్వారా అప్ లోడ్ చేయాల్సిందిగా సూచించారు.
ఈ మొత్తం ప్రాంతం ఢిల్లీ ప్ర‌జ‌ల గుండె చ‌ప్పుడ‌ని నాకు తెలుసు, పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు త‌మ కుటుంబాల‌తో ఇక్కడికి వ‌చ్చి వారు త‌మ సాయంత్రాల‌ను ఇక్క‌డ గ‌డుపుతారు. ఈ విష‌యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని క‌ర్త‌వ్య‌ప‌థ్ ప్ర‌ణాళిక‌, డిజైనింగ్ , లైటింగ్ ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ  క‌ర్త‌వ్య‌పథ్ స్పూర్తి దేశంలో క‌ర్త‌వ్య వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తుంది.  ఇది నూత‌న‌, అభివృద్ధి చెందిన భార‌త‌దేశ సంకల్పాన్ని నెర‌వేర్చ‌డానికి మ‌న‌ల్ని ముందుకు తీసుకువెళుతుంది, అని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.
 కేంద్ర గృహ , ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ హ‌ర్దీప్ సింగ్ పూరి, కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి శ్రీ జి.కిష‌న్‌రెడ్డి, కేంద్ర సాంస్కృతిక  వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రులు, శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌, శ్రీ‌మ‌తి మీనాక్షి లేఖి, కేంద్ర హౌసింగ్‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ స‌హాయ‌మంత్రి శ్రీ కౌశ‌ల్ కిషోర్ త‌దిత‌రులు ఈ సంద‌ర్భంగా హాజ‌ర‌య్యారు.
నేప‌థ్యంః
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు క‌ర్త‌వ్య‌ప‌థ్‌ను ప్రారంభించారు. ఇది ఒక‌ప్ప‌టి అధికార‌కేంద్రం నుంచి ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యానికి, సాధికార‌త‌కు ప్ర‌తిరూపంగా క‌ర్త‌వ్య‌ప‌థ్ ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలవ‌నుంది. ప్ర‌ధానమంత్రి ఈ సంద‌ర్భంగా  ఇండియా గేట్ వ‌ద్ద‌ నేతాజీ సుభాష్ చంద్రబోస్  విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అమృత్ కాల్‌లో సూచించిన పంచ్ ప్రాణ్ లోని రెండో అంశమైన , వ‌ల‌స‌పాల‌నావ‌శేషం ఎంత చిన్న రేణువైనా దానిని తొలగించాల‌న్న దానికి అనుగుణంగా ఈ చర్య‌లు ఉన్నాయి.
చాలా సంవ‌త్స‌రాలుగా రాజ్‌ప‌థ్‌, సెంట్ర‌ల్ విస్టా అవెన్యూ ప‌రిస‌ర ప్రాంతాలలో సంద‌ర్శ‌కుల ర‌ద్దీ పెర‌గ‌డంతో మౌలిక‌స‌దుపాయాల‌పై  ఒత్తిడి పెరిగింది. అక్క‌డ ప‌బ్లిక్ టాయిలెట్‌లు, మంచినీటి స‌ర‌ఫ‌రా,వీధుల‌లో స‌దుపాయాలు, పార్కింగ్ స్థలానికి సంబంధించి మౌలిక‌స‌దుపాయాల లేమి ఉండేది.రిప‌బ్లిక్ దినోత్స‌వ పెరేడ్‌, ఇత‌ర జాతీయ కార్య‌క్ర‌మాల స‌మ‌యంలో ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు పెద్దగా అంత‌రాయం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రాన్నీ గుర్తించ‌డం జ‌రిగింది. ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత పున‌ర్ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం అభివృద్ధి చేసిన క‌ర్త‌వ్య‌ప‌థ్ అద్భుత‌మైన ప‌రిస‌రాలు , ప‌చ్చిక మైదానాలు, న‌డ‌క‌దారులు, హ‌రిత ప్ర‌దేశం, పున‌ర్ నిర్మించిన కాలువ‌లు, నూత‌న స‌దుపాయాల బ్లాక్‌లు, మెరుగైన సూచిక‌లు వెండింగ్ కియోస్క్‌లు, కొత్త న‌డ‌క‌దారుల వంటి వాటిని ఇక్క‌డ సుంద‌రంగా తీర్చిదిద్దారు.

*****

DS/TS