Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఇండియా-ఆస్ట్రేలియా స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీ హ్యాకథన్ (ఐ-ఎసిఇ)’ ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

‘ఇండియా-ఆస్ట్రేలియా స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీ హ్యాకథన్ (ఐ-ఎసిఇ)’ ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం


మిత్రులారా,

కింద‌టి సంవ‌త్స‌రం జూన్ లో ప్ర‌ధాని శ్రీ మారిస‌న్ తో పాటు, నేను స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీ పై ఒక హ్యాక‌థ‌న్ ను నిర్వ‌హించ‌డాన్ని గురించి చ‌ర్చించుకొన్నాము.

అప్ప‌టి మా ఆలోచ‌న ఇంత త్వ‌ర‌గా కార్య‌రూపం దాల్చినందుకు నాకు సంతోషంగా ఉంది.

ఈ సంయుక్త కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని శ్రీ స్కాట్ మారిస‌న్ త‌న మ‌ద్ధ‌తు ను అందిస్తున్నందుకు గాను నేను ఆయ‌న కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యం లో సైతం ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్న వారంద‌రికీ వారి వ‌చ‌న బ‌ద్ధ‌త కు గాను నేను అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను.

నా దృష్టి లో మీరంద‌రూ విజేత‌లే.

మిత్రులారా,

జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న రువ్విన స‌వాళ్ళ‌ ను మాన‌వ జాతి ఎదుర్కొంటున్న త‌రుణం లో ఈ హ్యాక‌థ‌న్ కు ఎంచుకున్న ఇతివృత్తం యావ‌త్తు ప్ర‌పంచానికి సంద‌ర్భోచిత‌మైందిగా ఉంది.

వినియోగం ప్ర‌ధానం గా ఉన్న ఆర్థిక న‌మూనాలు మ‌న ప్ర‌పంచం పైన ఒక గొప్ప క్లేశాన్ని తెచ్చిపెట్టాయి.

మ‌నం భూ మాత అందిస్తున్న వ‌న‌రులు అన్నింటికీ య‌జ‌మానులం కాద‌ని, మ‌నం ఆ వ‌న‌రుల కు భావి త‌రాల త‌ర‌ఫున ధ‌ర్మ‌క‌ర్త‌లం గా మాత్ర‌మే ఉన్నామ‌న్న సంగ‌తి ని ఎన్న‌టికీ మ‌ర‌చిపోకూడ‌దు.

మ‌నం మ‌న ఉత్ప‌త్తి ప్ర‌క్రియ‌ల ను మ‌రింత స‌మ‌ర్ధ‌మైన‌వి గాను, వాతావ‌ర‌ణానికి త‌క్కువ స్థాయి లో హాని చేసేట‌టువంటి గాను తీర్చిదిద్దుకొన్నంత మాత్రాన స‌రిపోదు.

ఎవ‌రైనా ఒక వ్య‌క్తి ఎంత వేగం గా లేదా ఎంత నెమ్మ‌ది గా వాహ‌నాన్ని న‌డిపిన‌ప్ప‌టికీ కూడా, ఆ వాహ‌నం సాగిపోతున్న దిశ స‌రైన‌ది కాక‌పోతే, అటువంట‌ప్పుడు ఆ వ్య‌క్తి చేరుకోవ‌ల‌సిన గ‌మ్యాన్ని కాకుండా, మ‌రో చోటుకు వెళ్ళిపోతారు.

మ‌రి ఈ కార‌ణం గా మ‌నం స‌రి అయిన‌టువంటి దిశ ను ఎంచుకొని తీరాలి.  

మ‌నం మ‌న వినియోగం న‌మూనాల ను ప‌రిశీలించుకోవాలి.  అలాగే, మ‌నం వాటి తాలూకు ప‌రిస‌రాలపై ప్ర‌భావాన్ని ఏ మేర‌కు త‌గ్గించ‌గ‌ల‌మో అన్నది కూడా ప‌రిశీల‌న జ‌రుపుకోవాలి.

స‌రిగ్గా ఇక్క‌డే ఒక స‌ర్క్యుల‌ర్‌ ఇకాన‌మీ తాలూకు భావ‌న తెర మీద కు వ‌స్తుంది.

అది మ‌నం ఎదుర్కొనే అనేక స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించుకోవ‌డం లో ఒక కీల‌క‌మైన పాత్ర ను పోషించే వీలుంది.

వ‌స్తువు ల‌ను రీసైకిల్ చేయ‌డం, అలా మ‌ళ్ళీ వినియోగం లోకి తెచ్చుకోవ‌డం, వ్య‌ర్థాల ను నిర్మూలించ‌డం, వ‌న‌రుల ను స‌మ‌ర్ధం గా వాడుకొనే విధానాల ను మెరుగు ప‌ర‌చుకోవ‌డం అనేది మ‌న జీవ‌న శైలుల లో భాగం అయి తీరాలి.

ఈ హ్యాక‌థ‌న్ లో భార‌త‌దేశ విద్యార్థులు, ఆస్ట్రేలియా కు చెందిన విద్యార్థులు, స్టార్ట్‌-అప్స్‌, న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల ద‌గ్గ‌రి నుంచి వినూత్న‌మైన ప‌రిష్కార మార్గాలు వెల్ల‌డి అయ్యాయి.

ఈ నూత‌న ఆవిష్క‌ర‌ణ లు స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీ సిద్ధాంతానికి మీరు ఎంత‌గా నిబ‌ద్ధులై ఉన్న‌దీ చాటి చెప్తున్నాయి.

మీ నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు స‌ర్క్యుల‌ర్ ఇకాన‌మీ సొల్యూష‌న్స్ లో మ‌న రెండు దేశాలు నాయ‌క‌త్వ స్థానాన్ని అందుకోవ‌డానికి ప్రేర‌ణ ను అందిస్తాయ‌నే అంశం లో నాకు ఎలాంటి అనుమానం లేదు.

మ‌రి, దీనికి గాను, మ‌నం ఈ ఆలోచ‌న‌ల‌ ను ఇంకాస్త ముందుకు తీసుకుపోయి, భారీ స్థాయి లో కార్యాచ‌ర‌ణ రూపాన్ని ఎలా ఇవ్వ‌గ‌లుగుతామో అన్నది కూడా ఇక అన్వేషించ‌వ‌ల‌సి ఉంది.

మిత్రులారా,

కొత్త కొత్త ఆలోచ‌న‌లన్నా, నూత‌న ఆవిష్క‌ర‌ణలన్నా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ముందంజ వేయ‌డం,  ఊహించిన‌ది కాకుండా, మ‌రేదో ఎదురైన‌ప్ప‌టికీ వెనుదీయ‌క‌పోవ‌డం..  వీటిలో నుంచే యువ‌త తాలూకు శ‌క్తి బ‌య‌ట‌కు వ‌స్తుంది.  

ఈనాటి ఈ కార్య‌క్ర‌మం లో భాగం పంచుకొన్న యువ ఔత్సాహికుల లో పెల్లుబుకుతున్న శ‌క్తే భార‌త‌దేశాని కి, ఆస్ట్రేలియా కు మ‌ధ్య మునుముందుకు సాగిపోయేట‌టువంటి భాగ‌స్వామ్యాని కి ఒక ప్ర‌తీక‌గా నిలుస్తోంది.

మ‌న యువ‌తీ యువ‌కుల లోని శ‌క్తి, సృజ‌నాత్మ‌క‌త‌, ఒక మూస‌కు ప‌రిమితం కాన‌టువంటి ఆలోచ‌న‌ల స‌ర‌ళి ప‌ట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది.

వారు ఒక్క మ‌న ఇరు దేశాల కే గాక‌, యావ‌త్తు ప్ర‌పంచానికి నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి, స‌మ‌గ్ర‌మైన‌టువంటి ప‌రిష్కారాల ను చూప‌గ‌ల స‌మ‌ర్ధులు.

దృఢ‌మైన భార‌త‌దేశాని కి, ఆస్ట్రేలియా కు మ‌ధ్య గ‌ల దృఢ‌మైన భాగ‌స్వామ్యం కొవిడ్ అనంత‌ర కాలం లో ప్ర‌పంచానికి ఒక ఆకృతిని ఇవ్వ‌డం లో ఒక ముఖ్య‌మైన పాత్ర ను పోషిస్తుంది.

ఈ భాగ‌స్వామ్యాని కి మ‌న యువ‌త‌, మ‌న యువ నూత‌న ఆవిష్క‌ర్త‌లు, మ‌న స్టార్ట్‌-అప్ లు ముందు భాగాన నిల‌బ‌డ‌బోతున్నాయి.

మీకంద‌రికీ ధ‌న్య‌వాదాలు!

మీకు అనేకానేక ధ‌న్యవాదాలు.

 

***