Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియా ఆఫ్రికా ఫోరం శిఖ‌రాగ్ర స‌మావేశం నేప‌థ్యంలో ఆఫ్రికా నేత‌ల‌తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ద్వైపాక్షిక స‌మావేశాలు

న్యూఢిల్లీలో భార‌త్ – ఆఫ్రికా ఫోరం శిఖ‌రాగ్ర స‌మావేశ నేప‌థ్యంలో ఆఫ్రికా నేత‌ల‌తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ద్వైపాక్షిక స‌మావేశాలు నిర్వ‌హించారు.

ఆఫ్రిక‌న్ యూనియ‌న్ ఛైర్మ‌న్, జింబాబ్వే అధ్య‌క్షుడు శ్రీ రాబ‌ర్ట్ ముగాబే తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్రే మోదీ స‌మావేశ‌మ‌య్యారు. ఐక్య‌రాజ్య‌స‌మితి సంస్క‌ర‌ణ‌లు, ఉగ్ర‌వాద ముప్పు అంశాల‌తో పాటు ఇరుదేశాలకు చెందిన ప‌లు ఉమ్మ‌డి అంశాల‌పైన ఇరునేత‌లు చ‌ర్చించారు.

భార‌త‌దేశం, జింబాబ్వేల మ‌ధ్య‌ గ‌ల సుహృద్భావ ద్వైపాక్షిక బంధాల‌పైన ప్ర‌ధాని మాట్లాడారు. జింబాబ్వే అధ్య‌క్షుడు శ్రీ ముగాబే ఇండియా ఆఫ్రికా ఫోరం శిఖ‌రాగ్ర స‌మావేశానికి స‌హ అధ్య‌క్షునిగా ఉన్నారు. ఈ స‌మావేశానికి జ‌రుగుతున్న ఏర్పాట్లును ఇరు నేత‌లు స‌మీక్షించారు.

ఘ‌నా దేశ అధ్య‌క్షుడు శ్రీ జాన్ డ్రమాని మ‌హామాతోనూ ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల సంబంధాలు, వాణిజ్య అభివృద్ధి చ‌ర్చ‌కు వ‌చ్చాయి. వ్య‌వ‌సాయం, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ, నైపుణ్యాల అభివృద్ధి, సైబ‌ర్ సెక్యూరిటీ, స‌ముద్ర జ‌లాల్లో భ‌ధ్ర‌తలాంటి ప‌లు ప్రాధాన్య‌త‌ల‌గ‌ల అంశాలు ఇరునేత‌ల మ‌ధ్య‌ చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

స్వాజిలాండ్ రాజు శ్రీ ఎంస్వతి III తో ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. త‌మ‌ దేశ అభివృద్ధి కోసం చేప‌డుతున్న ప‌లు కార్య‌క్ర‌మాల‌ను రాజు శ్రీ ఎంస్వ‌తి ఈ స‌మావేశంలో పేర్కొన్నారు. ప్రాథ‌మిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, పునః వినియోగ ఇంధ‌నాల త‌యారీ, నైపుణ్యాల అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. స్వాజిలాండ్ దేశ రాజు నాయ‌క‌త్వ ప‌టిమ‌ను, దూర‌దృష్టిని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు. ఆ దేశ అభివృద్ధికి భార‌త‌దేశ సాయం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.

బెనిన్ దేశ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ బోని య‌వితో ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. ఇరుదేశాల మ‌ధ్య‌ పెరుగ‌తున్న ఆర్థిక బంధంపైన ఇరు దేశాల‌ నేత‌లు మాట్లాడుకున్నారు. వ్య‌వ‌సాయంలో యాంత్రీక‌ర‌ణ‌, విద్యుత్ ఉత్ప‌త్తి, నీటి స‌ర‌ఫ‌రా, ర‌వాణాలాంటి ప‌లు అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

నైజీరియా అధ్య‌క్షుడు శ్రీ మొహ‌మ్మ‌ద్ బుహారితో ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. చ‌మురు అన్వేష‌ణ‌, ర‌క్ష‌ణ రంగాల స‌హ‌కారం, ఐక్య‌రాజ్య‌స‌మితి సంస్క‌ర‌ణ‌లు మొద‌లైన అంశాలు ఇరు నేత‌ల మ‌ధ్య‌ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

కెన్యా అధ్య‌క్షుడు శ్రీ యుహురు కెన్యాట్టాతో స‌మావేశ‌మైన ప్ర‌ధాని ఇరు దేశాల మ‌ధ్య‌ స‌హ‌కారానికి అవ‌కాశ‌మున్న ప‌లు అంశాల‌పైన చ‌ర్చించారు. ఆరోగ్య రంగం, ప్రాథ‌మిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, వాణిజ్యం, ఆర్థిక బంధాలు మొద‌లైన అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల చారిత్రాత్మ‌క బంధం, కెన్యాలో నివ‌సిస్తున్న భార‌తీయ సంత‌తి గురించి ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌ నేత‌లు మాట్లాడుకున్నారు. ఉగ్ర‌వాదం, ఐక్య‌రాజ్య‌స‌మితి సంస్క‌ర‌ణ‌లు కూడా ఇరు దేశాల‌ నేత‌ల చ‌ర్చ‌ల్లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి.

ద‌క్షిణ ఆఫ్రికా అధ్య‌క్షుడు శ్రీ జాక‌బ్ జుమాతో ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. ఇరు దేశాల మ‌ధ్య‌ చారిత్రాత్మ‌క బంధం గురించి ఇరునేత‌లు ముచ్చ‌టించుకున్నారు. ఉగ్ర‌వాదం, ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి సంస్క‌ర‌ణ‌లు, ప్ర‌పంచ‌పాల‌నా వ్య‌వ‌స్థ‌ల సంస్క‌ర‌ణ‌లు మొద‌లైన అంశాలు ఇరు నేత‌ల మ‌ధ్య‌ చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ఉగాండా అధ్య‌క్షుడు శ్రీ యోహెరి ముసెవెనితో ప్ర‌ధాని స‌మావేశ‌మ‌య్యారు. ఇరు దేశాల మ‌ధ్య‌ స‌త్ సంబంధాల పెంపుపైన ఇరు నేత‌లు చ‌ర్చించారు. ప‌ర‌స‌స్ప‌రం న‌మ్మ‌కం పెరిగేలా ఇరు దేశాల మ‌ధ్య‌ సంబంధాలు అభివృద్ధి చెందాల‌ని నేత‌లు ఆకాంక్షించారు.