ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మూడు సెమికండక్టర్ ప్రాజెక్టుల కు ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా శంకుస్థాపన చేయడం తో పాటుగా, ‘ఇండియాస్ టెకేడ్: చిప్స్ ఫార్ వికసిత్ భారత్’ కార్యక్రమం లో పాలుపంచుకొని సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు కూడాను. ఈ రోజు న శంకుస్థాపన జరిగిన సెమికండక్టర్ ప్రాజెక్టు లు మూడిటి విలువ దాదాపు గా 1.25 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది. ఈ రోజు న ప్రారంభించిన సదుపాయాల లో గుజరాత్ లో ధోలెరా స్పెశల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) లోని సెమికండక్టర్ పేబ్రికేశన్ ఫెసిలిటీ, అసమ్ లోని మోరీగాఁవ్ లో అవుట్సోర్స్ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) ఫెసిలిటీ తో పాటు గుజరాత్ లోని సాణంద్ లో అవుట్సోర్స్ డ్ సెమికండక్టర్ అసెంబ్లి ఎండ్ టెస్ట్ (ఒఎస్ఎటి) సదుపాయం భాగం గా ఉన్నాయి.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, గుజరాత్ లోని సాణంద్ లో, ధోలెరా లో, అసమ్ లోని మోరిగాఁవ్ లో దాదాపు గా 1.25 లక్షల కోట్ల రూపాయల విలువైన మూడు ప్రధాన సెమికండక్టర్ తయారీ ప్రాజెక్టుల కు శంకుస్థాపన జరగడం ఒక చరిత్రాత్మకమైన ఘట్టం, మరి ఇది భారతదేశం యొక్క ప్రకాశవంతమైన భవిష్యత్తు దిశ లో పడినటువంటి ఒక ముఖ్యమైన అడుగు అంటూ అభివర్ణించారు. ‘‘ఈ రోజు న చేపట్టుకొన్న ప్రాజెక్టు లు భారతదేశాన్ని ఒక సెమికండక్టర్ హబ్ గా తీర్చిదిద్దడం లో ప్రముఖ పాత్ర ను పోషించనున్నాయి’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కీలక కార్యక్రమాల కు గాను పౌరుల కు అభినందనల ను ఆయన వ్యక్తం చేశారు. ఈ రోజు న జరిగిన కార్యక్రమం లో తైవాన్ కు చెందిన సెమికండక్టర్ పరిశ్రమ ప్రముఖులు వర్చువల్ పద్ధతి లో పాలుపంచుకోవడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించి, భారతదేశం యొక్క ఈ ప్రయాసల కు గాను ఆయన తన ఉత్సాహాన్ని వెలిబుచ్చారు.
ఈ రోజు న జరిగిన విశిష్టమైన కార్యక్రమం తో 60,000 కు పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు విద్య బోధన సంస్థలు జత పడ్డాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న జరిగిన ఈ యొక్క కార్యక్రమం దేశ యువతీ యువకులు కలలు గన్న కార్యక్రమం, భారతదేశం భవిష్యత్తు కు నిజమైన స్టేక్ హోల్డర్స్ యువతీ యువకులు కావడమే దీనికి కారణం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. గ్లోబల్ సప్లయ్ చైన్ లో స్వయం సమృద్ధి యుక్తమైనటువంటి విధం గాను మరియు పటిష్టమైనటువంటి విధం గాను ముందుకు పోయేందుకు భారతదేశం బహుముఖీనమైన తరహా లో ఏ విధం గా పాటుపడుతున్నదీ యువత గమనిస్తోంది అని ఆయన అన్నారు. ‘‘ఆత్మవిశ్వాసం కలిగిన యువత దేశ భాగ్యాన్ని మార్చి వేస్తుంది ’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సాంకేతిక విజ్ఞానం చోదక శక్తి గా ఉంటున్నటువంటి 21 వ శతాబ్దం లో ఎలక్ట్రానిక్స్ చిప్స్ కు ఎంతో ప్రాముఖ్యం ఉందని ప్రధాన మంత్రి చెప్తూ, భారతదేశాన్ని ఆత్మనిర్భరత దిశ లో మరియు ఆధునికీకరణ దిశ లో పయనించేటట్లు చూడడం లో మేడ్ ఇన్ ఇండియా చిప్ లు, డిజైన్డ్ ఇన్ ఇండియా చిప్ లు ఒక ప్రముఖ పాత్ర ను పోషించ నున్నాయన్నారు. వేరు వేరు కారణాల రీత్యా మొదటి మూడు పారిశ్రమిక విప్లవాల లో పాల్గొనలేకపోయిన భారతదేశం ప్రస్తుతం నాలుగో పారిశ్రమిక విప్లవం ‘ఇండస్ట్రీ 4.0’ కు నాయకత్వం వహించాలన్న సంకల్పం తో అడుగులు వేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క సెకండు ను ఉపయోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ప్రభుత్వం ఎంత వేగం తో కృషి చేస్తోందనే దానికి ఉదాహరణ గా ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమం నిలచింది అన్నారు. సెమికండక్టర్ రంగం లో పురోగమనం యొక్క క్రమాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, రెండేళ్ళ క్రితం సెమికండక్టర్ మిశను ను ప్రకటించడమైంది, కొద్ది నెలల లోనే తొలి ఎమ్ఒయు లపై సంతకాలయ్యాయి; ఇక ఇప్పుడు మూడు ప్రాజెక్టుల కు శంకుస్థాపన లు జరుగుతూ ఉన్నాయి అన్నారు. ‘‘భారతదేశం వాగ్దానాన్ని చేస్తుంది, భారతదేశం నెరవేర్చుతుంది, ఇంకా ప్రజాస్వామ్యం నెరవేర్చుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రస్తుతం ప్రపంచం లో సెమికండక్టర్ లను తయారు చేస్తున్న దేశాల ను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చును అని ప్రధాన మంత్రి చెప్తూ, కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన ఫలితం గా చోటు చేసుకొన్న విచ్ఛిన్నాల నేపథ్యం లో ఒక విశ్వసనీయ సప్లయ్ చైన్ తాలూకు అవసరం పెరిగిపోయింది అని నొక్కి చెప్పారు. ఈ విషయం లో ఒక కీలకమైన పాత్ర ను పోషించాలని భారతదేశం ఉత్సాహ పడుతోంది అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో దేశం లోని సాంకేతిక విజ్ఞాన రంగం గురించి, పరమాణు శక్తి ని గురించి మరియు డిజిటల్ సత్తా ను గురించి ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు. సెమికండక్టర్ రంగం లో వాణిజ్య సరళి లో ఉత్పత్తి ని చేపట్టడాని కి భారతదేశం లో స్థితి సానుకూలం గా ఉంది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, ఈ రంగం లో రాబోయే కాలం లో అమలు చేయబోయే ప్రణాళికల ను గురించి వివరించారు. ‘‘సెమికండక్టర్ రంగం కోసం అవసరమైన ఉత్పత్తుల ను తయారు చేయడం లో భారతదేశం ఒక గ్లోబల్ పవర్ గా మారే రోజు ఎంతో దూరం లో లేదు’’ అని ఆయన అన్నారు. ఈ రోజు న తీసుకొన్న విధాన నిర్ణయాల ద్వారా భవిష్యత్తు లో భారతదేశం వ్యూహాత్మకమైనటువంటి ప్రయోజనాన్ని అందుకోనుంది అని ఆయన అన్నారు. ఈ సందర్భం లో చట్టాల ను ఇట్టే అర్థం చేసుకొనేటట్టుగా రూపుదిద్దడం తో పాటు వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం కూడా ప్రోత్సాహకరం గా మారింది అని ఆయన అన్నారు. గత కొన్నేళ్ళ లో 40,000 కు పైచిలుకు పాటించక తప్పనిసరైన నియమాల ను తొలగించడమైంది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్డిఐ) నియమాల ను సులభతరం గా మార్చడమైంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. రక్షణ, బీమా మరియు టెలికం రంగాల లో ఎఫ్డిఐ సంబంధి విధానాల ను సరళతరం చేయడమైందన్నారు. ఎలక్ట్రానిక్స్ లోను, హార్డ్ వేర్ మేన్యుఫేక్చరింగ్ లోను భారతదేశం స్థితి అంతకంతకు వృద్ధి చెందుతోంది అని కూడా ప్రధాన మంత్రి తెలిపారు. ఆయా రంగాల లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాలు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ తయారీ కి, ఇంకా ఐటి హార్డ్ వేర్ తయారీ కి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచాయి, దీనికి తోడు ఎలక్ట్రానిక్ క్లస్టర్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ఎలక్ట్రానిక్ ఇకోసిస్టమ్ యొక్క వృద్ధి కి ఒక వేదిక ను అందుబాటు లోకి తీసుకు రావడమైంది అని ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం లో రెండో అతి పెద్దదైన మొబైల్ తయారీదారు దేశం గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం యొక్క క్వాంటమ్ మిశను ను గురించి, భారతదేశం లో నూతన ఆవిష్కరణ లను ప్రోత్సహించడాని కి మరియు ఎఐ మిశన ను విస్తరించడానికి నేశనల్ రిసర్చ్ ఫౌండేశను ను ఏర్పాటు చేయడాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, సాంకేతిక విజ్ఞానాన్ని అక్కున చేర్చుకోవడం తో పాటు సాంకేతిక విజ్ఞాన రంగం లో పురోగతి దిశ లో కూడాను భారతదేశం సాగిపోతుందన్నారు.
సెమీకండక్టర్ పరిశోధన వల్ల యువతకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. విస్తృత శ్రేణి పరిశ్రమలలో సెమీకండక్టర్ల విస్తృతిని ప్రస్తావిస్తూ, “సెమీకండక్టర్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, ఇది అపరిమితమైన సామర్ధ్యంతో నిండిన ద్వారాలను తెరుస్తుంది” అని ప్రధాన మంత్రి అన్నారు. గ్లోబల్ చిప్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ లో భారతీయ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో ఉన్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందువల్ల సెమీకండక్టర్ తయారీ రంగంలో దేశం నేడు ముందుకు సాగుతున్న కొద్దీ భారతదేశం సామర్థ్య పర్యావరణ వ్యవస్థ (టాలెంట్ ఎకోసిస్టమ్) పూర్తయిందని ప్రధాన మంత్రి అన్నారు. స్పేస్ అయినా, మ్యాపింగ్ సెక్టార్ అయినా నేటి యువతకు ఉన్న అవకాశాల గురించి బాగా తెలుసని, ఈ రంగాలను యువత కోసం తెరవాలని సూచించారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ గా ఎదగడానికి అపూర్వమైన ప్రోత్సాహకాలు, ప్రోత్సాహం లభించిందని, సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్ లకు నేటి సందర్భం కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. నేటి ప్రాజెక్టులు యువతకు అనేక అధునాతన సాంకేతిక ఉద్యోగాలను అందిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎర్రకోట నుంచి తాను చేసిన నినాదాలను గుర్తుచేసుకున్న ప్రధాన మంత్రి – యహి సమయ్ హై సహి సమయ్ హై, ఈ నమ్మకంతో తీసుకున్న విధానాలు, నిర్ణయాలు గణనీయమైన ఫలితాలను ఇస్తాయని అన్నారు. భారత్ ఇప్పుడు పాత ఆలోచనలు, పాత విధానం కంటే చాలా ముందుకు వెళ్లింది. భారతదేశం ఇప్పుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. విధానాలను రూపొందిస్తోంది” అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశ సెమీ కండక్టర్ కలలు 1960వ దశకంలో మొదట ఊహించబడ్డాయని, కానీ సంకల్పం లేకపోవడం, తీర్మానాలను విజయాలుగా మార్చే ప్రయత్నం లేని కారణంగా అప్పటి ప్రభుత్వాలు వాటిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు. దేశ సామర్థ్యాన్ని, ప్రాధాన్యాలను, భవిష్యత్ అవసరాలను గత ప్రభుత్వాలు అర్థం చేసుకోలేకపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ ముందుచూపు, ఫ్యూచరిస్టిక్ విధానాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలనే ఆకాంక్ష తో సెమీ కండక్టర్ల తయారీ పై దృష్టి పెట్టినట్టు చెప్పారు. పేదలకు పక్కా ఇళ్లలో పెట్టుబడులు పెట్టడం, పరిశోధనలను ప్రోత్సహించడం, ప్రపంచంలోనే అతిపెద్ద పారిశుద్ధ్య ఉద్యమాన్ని నడపడం నుంచి సెమీకండక్టర్ ల తయారీ వైపు పురోగ మించడం, పేదరికాన్ని వేగంగా తగ్గించడంనుంచి , భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడుల వరకు ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఒక్క 2024లోనే రూ.12 లక్షల కోట్లకు పైగా విలువైన పథకాలకు శంకుస్థాపనలు జరిగాయని, రూ.12 లక్షల కోట్లకు పైగా విలువైన పథకాలను ప్రారంభించామని తెలిపారు. 21వ శతాబ్దపు భారత స్వావలంబన రక్షణ రంగానికి అద్దం పట్టిన భారత్ శక్తి విన్యాసాన్ని ప్రస్తావిస్తూ, అగ్ని-5 రూపంలో భారత్ ప్రపంచంలోని ప్రత్యేక క్లబ్ లో చేరిందని ప్రధాన మంత్రి అన్నారు. రెండు రోజుల క్రితం వ్యవసాయంలో డ్రోన్ విప్లవానికి శ్రీకారం చుట్టామని, నమో డ్రోన్ దీదీ పథకం కింద వేలాది డ్రోన్లను మహిళలకు అంద చేసినట్టు తెలిపారు. గగన్ యాన్ కోసం భారతదేశం సన్నాహాలు ఊపందుకున్నాయని చెప్పారు. ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొదటి మేడ్ ఇన్ ఇండియా ఫాస్ట్ బ్రీడర్ న్యూక్లియర్ రియాక్టర్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రయత్నాలన్నీ, ఈ ప్రాజెక్టులన్నీ భారతదేశాన్ని అభివృద్ధి లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్తున్నాయి. ఖచ్చితంగా, ఈ రోజు ఈ మూడు ప్రాజెక్టులు కూడా ఇందులో పెద్ద పాత్ర పోషిస్తాయి“, అని ప్రధాని మోదీ అన్నారు.
నేటి ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిర్భావాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. తన ప్రసంగాలు తక్కువ సమయంలో బహుళ భాషల్లోకి అనువదించబడిన ఉదాహరణను ఇచ్చారు. వివిధ భారతీయ భాషల్లో ప్రధాన మంత్రి సందేశాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి భారత యువత చొరవ తీసుకున్నారని ఆయన ప్రశంసించారు. భారత యువత సమర్థులని, వారికి అవకాశం అవసరమన్నారు. “సెమీకండక్టర్ చొరవ ఈ రోజు భారతదేశానికి ఆ అవకాశాన్ని తీసుకువచ్చింది” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ఆయన ప్రశంసించారు. అస్సాంలో మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లలో ఒకదానికి నేడు శంకుస్థాపన జరుగుతోందన్నారు. ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి, భారతదేశ పురోగతిని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరికీ ఉద్బోధించారు. ” మోదీ హామీ మీకు ఇంకా మీ భవిష్యత్తుకు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ,సిజి పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ వెల్లయన్ సుబ్బయ్య, టాటా సన్స్ చైర్మన్ శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధికి భారత్ ను గ్లోబల్ హబ్ గా నిలబెట్టడం, దేశ యువతకు ఉపాధి అవకాశాల కల్పనను ప్రోత్సహించడం ప్రధాన మంత్రి దార్శనికత. ఈ విజన్ కు అనుగుణంగా గుజరాత్ లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ ( డిఎస్ఐఆర్ )లో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. అసోంలోని మోరిగావ్ లో ఔట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయం ఉంది. గుజరాత్ లోని సనంద్ లో ఔట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయం ఉంది.
భారతదేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్స్ ఏర్పాటు కోసం సవరించిన పథకం కింద ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (డిఎస్ఐఆర్) వద్ద సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టిఇపిఎల్) ఏర్పాటు చేస్తుంది. మొత్తం రూ.91,000 కోట్లకు పైగా పెట్టుబడితో దేశంలోనే తొలి కమర్షియల్ సెమీకండక్టర్ ఫ్యాబ్ ఇదే అవుతుంది.
అస్సాంలోని మోరిగావ్ లో ఔట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయాన్ని టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఈపీఎల్) మోడిఫైడ్ స్కీమ్ ఫర్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కింద సుమారు రూ.27,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది.
సనంద్ లో ఔట్ సోర్సింగ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (ఓశాట్) సదుపాయాన్ని సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ మోడిఫైడ్ స్కీమ్ ఫర్ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) కింద సుమారు రూ.7,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది.
ఈ సౌకర్యాల ద్వారా సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతుంది. భారత్ లో సుస్థిర స్థానం లభిస్తుంది. లభిస్తుందన్నారు. ఈ యూనిట్లు సెమీకండక్టర్ పరిశ్రమలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఎలక్ట్రానిక్స్, టెలికాం వంటి సంబంధిత రంగాల్లో ఉపాధి కల్పనకు ఊతమివ్వనున్నాయి.
ఈ కార్యక్రమంలో వేలాది మంది కళాశాల విద్యార్థులు, సెమీకండక్టర్ పరిశ్రమకు చెందిన నాయకులతో సహా యువకులు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని వీక్షించారు.
****
India is set to become a prominent semiconductor manufacturing hub. The three facilities will drive economic growth and foster innovation.https://t.co/4c9zV3G9HL
— Narendra Modi (@narendramodi) March 13, 2024
India's rapid progress is driving confidence in our Yuva Shakti. pic.twitter.com/Ax9zrMvAJf
— PMO India (@PMOIndia) March 13, 2024
Chip manufacturing will take India towards self-reliance, towards modernity. pic.twitter.com/6n0YMhnlH7
— PMO India (@PMOIndia) March 13, 2024
Chip manufacturing opens the door to limitless possibilities. pic.twitter.com/L4fFhTIuQq
— PMO India (@PMOIndia) March 13, 2024
‘Made in India’ will be the buzzword as far as semiconductors is concerned. pic.twitter.com/OBxCoXZm3W
— Narendra Modi (@narendramodi) March 13, 2024
India is poised to become a world leader in semiconductors. pic.twitter.com/z3IH8asyV2
— Narendra Modi (@narendramodi) March 13, 2024
India’s reforms and efforts to promote semiconductors offer many opportunities for the youth. pic.twitter.com/1WzfM170xA
— Narendra Modi (@narendramodi) March 13, 2024
Those who got the opportunity to rule for decades were not forward thinking or futuristic in their approach. We changed that. pic.twitter.com/5cnfIimOOn
— Narendra Modi (@narendramodi) March 13, 2024