Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ఐటిఎస్) అధికారులకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి) గా పదోన్నతి కల్పించేందుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


1989 నుండి 1991 బ్యాచ్ లకు చెందిన ఇండియన్ ట్రేడ్ సర్వీస్ (ఐటిఎస్) అధికారులకు సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (ఎస్ఎజి) గా in- situ పదోన్నతి కల్పించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ అధికారులను ఆన్ పర్సనల్ బేసిస్ (on personal basis), యాజ్ ఎ వన్ టైమ్ రిలాక్సేశన్, ‘ఎస్ఎజి లో కాడర్ పోస్ట్ ఖాళీలు అయినప్పుడల్లా’ అనే షరతుపై సర్దుబాటు చేయడం జరుగుతుంది. అలాగే, ఈ అధికారులు- వారి పదవీవిరమణ అనంతరం లేదా ఎస్ఎజి యొక్క మంజూరైన సిసలు పోస్టుల సంఖ్య ను బట్టి కవర్ చేయడం కోసం- ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవులను ఒరిజినల్ లెవెల్ అయిన జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (జెఎజి) లోనే నిలిపి ఉంచుతారు.

ఈ ఆమోదం వ్యాపార ఉన్నతి మరియు ట్రేడ్ డిఫెన్స్ రంగాలలో వివిధ స్థానాలలో సార్ధక డమేన్ నాలెడ్జ్ కలిగివున్న సీనియర్ ఐటిఎస్ అధికారులను అట్టిపెట్టుకొని, వారి సేవలను లాభదాయకంగా వినియోగించుకొనేందుకు ప్రభుత్వానికి వీలు కల్పించగలదు. భారతదేశ ఎగుమతుల రంగంలో వేగవంతమైన వృద్ధిని సాధించాలన్న లక్ష్యం నెరవేరడానికి ఈ చర్య సహాయకారి కాగలదు. ఎస్ఎజి స్థాయికి ప్రమోషన్ ను కల్పించడమనేది సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ లో చేర్చడం కోసం ఈ అధికారుల పేర్లను పరిశీలించే వెసులుబాటునివ్వడమే కాక, భారత ప్రభుత్వ వేరు వేరు మంత్రిత్వ శాఖలు/విభాగాలలో సేవలందించడానికి అందుబాటులో ఉన్న అధికారుల సమూహంలో వీరిని కలపడానికి కూడా వీలును కల్పిస్తుంది. భారతదేశ అంతర్జాతీయ వ్యాపారం మరియు వ్యాపార వృద్ధికి సంబంధించిన వేరు వేరు అంశాలను పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థీకృత‌ కాడర్ అవసరాలు పెచ్చుపెరుగుతుండగా ఆ అవసరాలను తీర్చడానికిగాను ఇండియన్ ట్రేడ్ సర్వీసును సెంట్రల్ గ్రూప్ ‘ఎ’ సర్వీసు గా ఏర్పాటు చేశారు.