Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండియన్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన రెండు ఎకరాల భూమిని వెటరినరి కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు బదలాయించేందుకు మంత్రివర్గం ఆమోదం


న్యూ ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఐ ఎ ఆర్ ఐ) కి చెందిన రెండు ఎకరాల భూమిని వెటరినరి కౌన్సిల్ ఆఫ్ ఇండియా( వి సి ఐ) కి 99 సంవత్సరాల కాలానికి లీజు ప్రాతిపదికన బదలాయించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఒక ఏడాదికి ఒక చదరపు మీటరు స్థలానికి ఒక రూపాయి వంతున మొత్తం కిరాయి రూ. 8,01,278/- లు అవుతుంది.

ఇన్ సర్వీస్ లో ఉన్న పశు వైద్య సంబంధ వృత్తి నిపుణులకు జంతు శాస్త్ర విజ్ఞానపరమైన పరిశోధనలలో తాజా విజ్ఞానం తాలూకు స్వల్ప వ్యవధి కోర్సులను నిర్వహించడం ద్వారా వి సి ఐ తన నైపుణ్యాల మెరుగుదల కార్యకలాపాల పరిధిని విస్తరించుకోనున్నది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు అదనపు కార్యకలాపాలను కూడా విసిఐ చేపట్టనున్నది. ఈ కార్యకలాపాలు దేశంలో ఆర్థిక వృద్ధిని పెంపొందించడంతో పాటు ఉపాధి అవకాశాల కల్పనకు ఊతం అందించగలవు.