ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం మాధ్యం ద్వారా ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (ఐసిడిఆర్ఐ) యొక్క ఆరో సంచిక ను ఉద్దేశించి ఈ రోజు న ప్రసంగించారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ప్రముఖుల కు ఆత్మీయ స్వాగత వచనాల ను పలికారు. వారి యొక్క హాజరు ప్రపంచవ్యాప్త కార్యాచరణ ను పటిష్టం చేస్తుందని, మరి డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి ముఖ్యమైన అంశం లో తీసుకొనే నిర్ణయాల ను బలపరుస్తుందని ఆయన అన్నారు. 2019 వ సంవత్సరం లో కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) ను ప్రారంభించినప్పటి నుండి ఆకర్షణీయమైన వృద్ధి నమోదు అయింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ సంస్థ ప్రస్తుతం 39 దేశాలు మరియు 7 సంస్థల తో ఒక ప్రపంచ సంకీర్ణం గా కొనసాగుతోంది అని పేర్కొన్నారు. ‘‘భవిష్యత్తు కు ఇది ఒక శుభసంకేతం గా ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రాకృతిక విపత్తులు సంభవించడం అనేది తరచు గాను, తీవ్రం గాను ఉంటోంది; వాటి వల్ల కలిగే నష్టాన్ని సాధారణం గా డాలర్ లలో మదింపు చేయడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి చెప్తూ, ప్రాకృతిక విపత్తులు ప్రజల పైన, సముదాయాల పైన కలుగుజేసే వాస్తవిక ప్రభావం సంఖ్యల కు అందదు అని అన్నారు. మానవుల పట్ల ప్రాకృతిక విపత్తులు కలుగజేసే ప్రభావాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరిస్తూ, భూకంపాలు ఇళ్ళ ను కూల్చివేసి, తద్ద్వారా వేల కొద్దీ ప్రజల ను నిరాశ్రయుల ను చేస్తున్నాయి అన్నారు; ప్రాకృతిక విపత్తులు నీటి సరఫరా వ్యవస్థల ను, మురుగు పారుదల వ్యవస్థ ను విచ్ఛిన్నం చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని సంకటస్థితి లోకి నెట్టివేస్తున్నాయి అని ఆయన అన్నారు. ప్రాకృతిక విపత్తులు శక్తి ఉత్పాదన నిలయాల పైన కూడా ప్రభావాన్ని ప్రసరించి, తత్ఫలితం గా అపాయకర స్థితి తలెత్తేటట్లు చేస్తున్నాయి అని కూడా ఆయన అన్నారు.
‘‘ఒక మెరుగైనటువంటి రేపటి రోజు ను చూడాలి అంటే గనుక, ఈ రోజే ప్రకృతి విపత్తుల కు తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన లో మనం పెట్టుబడి పెట్టి తీరాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఆటుపోటుల ను తట్టుకొని నిలబడాలని అంటే, అందుకోసం సరిక్రొత్త గా మౌలిక సదుపాయాల కల్పన తో పాటుగా, విపత్తు అనంతరం చేపట్టవలసిన పునర్ నిర్మాణం కార్యాల పైన కూడా దృష్టి సారించాలి అని ఆయన నొక్కి చెప్పారు. విపత్తు అనంతర కాలం లో అందించవలసినటువంటి సహాయక మరియు పునరావాస కార్యక్రమాల ను అమలు చేసిన వెంటనే ప్రకృతి విపత్తుల ను ఎదుర్కొనేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన విషయం లో శ్రద్ధ వహించాలి అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రకృతి ప్రకోపాని కి మరియు విపత్తుల కు ఎటువంటి ఎల్లలు ఉండవు అనే విషయాన్ని ప్రధాన మంత్రి చెప్తూ, ఒక దేశం తో మరొక దేశం అమిత సంధానాన్ని ఏర్పరచుకొన్న ప్రస్తుత ప్రపంచం లో విపత్తులు మరియు విచ్ఛిన్నాలు కలిగించే ప్రభావం ఎంతగానో ఉంటుంది అన్నారు. ‘‘ప్రతి ఒక్క దేశం తన వంతు గా ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కొనేది గా మారినప్పుడు మాత్రమే ప్రపంచ దేశాలు అన్నీ ఈ విధమైనటువంటి సామర్థ్యాన్ని సంతరించుకోగలవు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. నష్ట భయాలు ప్రతి ఒక్క దేశాని కి ఎదురయ్యే కారణం గా ఆ విపత్తుల ను తట్టుకొనే చర్యల కు కూడా ఉమ్మడి ప్రాధాన్యాన్ని ఇవ్వవలసి ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. సిడిఆర్ఐ మరియు తాజా సమావేశం ఈ విధమైన ఉమ్మడి కార్యాచరణ లో ప్రపంచ దేశాలు అన్నీ ఏకతాటి మీదకు రావడం లో సహాయకారి కాగలుగుతాయి అని ఆయన అన్నారు.
“ప్రపంచ దేశాలు అన్నీ కూడాను ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కోవాలి అంటే గనుక, మనం అత్యంత బలహీనమైన దేశాల కు అండదండల ను అందించే తీరాలి’’ అని ప్రధాన మంత్రి చెప్పారు. చిన్న ద్వీప దేశాలు ఏవైతే ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నాయో వాటికి విపత్తుల తాలూకు నష్ట భయం అనేది ఉంది అనే విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించి, ఈ తరహా 13 ద్వీప దేశాల లో ఆర్థిక సహాయాన్ని అందజేయడం కోసం సిడిఆర్ఐ ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది అన్నారు. ఈ సందర్భం లో ఆయన డొమినికా లో కొన్ని ప్రత్యేకమైన గృహ నిర్మాణ పథకాలు చేపట్టడం, పాపువా న్యూ గినీ లో రవాణా నెట్ వర్క్ లను ఏర్పాటు చేయడం, డొమినికన్ రిపబ్లిక్ లో మరియు ఫిజీ లో అత్యధిక సామర్థ్యం కలిగి ఉండే ముందస్తు హెచ్చరిక వ్యవస్థల కల్పనల ను గురించి పేర్కొన్నారు. గ్లోబల్ సౌథ్ దేశాల విషయం లో సిడిఆర్ఐ శ్రద్ధ వహిస్తూ ఉన్నందుకు గాను ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
జి-20 సభ్యత్వ దేశాల కూటమి కి అధ్యక్ష బాధ్యత లను భారతదేశం నిర్వహించిన కాలం లో ఒక క్రొత్త డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయడం అనే అంశం పై మరియు ఆ గ్రూప్ నకు ఆర్థిక సహాయాన్ని అందించడం అనే అంశం పైన చర్చలు జరిగాయి అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వచ్చారు. ఆ తరహా చర్యలు సిడిఆర్ఐ వృద్ధి తో పాటు, ప్రపంచాన్ని ప్రాకృతిక విపత్తుల ను ఎదుర్కోగలిగే స్థితి లోకి తీసుకుపోతాయి అని ఆయన చెప్పారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఐసిడిఆర్ఐ లో చర్చోపచర్చలు సార్థకం అవుతాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.