శ్రేష్ఠులు మరియు మిత్రులారా,
మిత్రులారా,
గడచిన కొన్ని సంవత్సరాల లో కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) యొక్క వృద్ధి ఆకర్షణీయం గా ఉండింది. సిడిఆర్ఐ ని 2019 వ సంవత్సరం లో ఆరంభించినప్పటి నుండి మనం చాలా దూరం ప్రయాణించాం. ప్రస్తుతం దీనిలో 39 దేశాల మరియు 7 సంస్థ ల సంకీర్ణం ఏర్పడింది. భవిష్యత్తు దృష్టి లో ఇది ఒక శుభ సంకేతం గా ఉంది.
మిత్రులారా,
మనం అందరం గమనించిన ప్రకారం, ప్రాకృతిక విపత్తులు మరింత తరచుగా మరియు మరింత తీవ్రం గా సంభవిస్తున్నాయి. అవి కలిగించే నష్టాన్ని సాధారణం గా డాలర్ లలో చెబుతుంటారు. అయితే, ప్రజల పైన, కుటుంబాల పైన, ఇంకా సముదాయాల పైన వాటి తాలూకు నిజ ప్రభావం సంఖ్యల కు మించినది గా ఉంది. భూకంపాలు ఇళ్ళ ను నేలమట్టం చేసి, వేల కొద్దీ ప్రజలు ఆశ్రయం కోల్పోయేటట్లు చేస్తున్నాయి. ప్రాకృతిక విపత్తులు అనేవి నీరు మరియు మురుగు వ్యవస్థల ను ధ్వంసం చేసి, ప్రజల ఆరోగ్యాన్ని అపాయం లో పడవేస్తున్నాయి. కొన్ని విపత్తులు శక్తి ఉత్పాదన నిలయాల పైన ప్రభావాన్ని చూపెట్టి, అపాయకరమైన స్థితుల కు దారి తీస్తున్నాయి. ఇటువంటివి అన్నీ మానవుల ను నష్టపరుస్తున్నాయి.
మిత్రులారా,
మనం రేపటి మెరుగుదల కోసం ఈ రోజు నే ప్రకృతి విపత్తుల ను తట్టుకొని నిలబడగలిగేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన లో నిధుల ను పెట్టుబడి పెట్టక తప్పదు. సరిక్రొత్త మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే విపత్తుల ను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది. దీనికి అదనం గా విపత్తుల అనంతర కాలం లో చేపట్టవలసిన పునర్ నిర్మాణ పనులు కూడా ముఖ్యం. విపత్తులు సంభవించిన అనంతరం, తక్షణం శ్రద్ధ వహించవలసింది సహజం గానే ఉపశమన కారక చర్యలు మరియు పునరావాసం కల్పించడం అనేవి. మొదట గా తీసుకోవలసిన ప్రతిస్పందన పూర్వక చర్యల తరువాత మనం మౌలిక సదుపాయాల పటిష్టీకరణ పైన సైతం శ్రద్ధ వహించాలి.
మిత్రులారా,
ప్రకృతి కి మరియు విపత్తుల కు సరిహద్దులు అనేవి ఏవీ ఉండవు. ఒక దేశం తో మరొక దేశం పరస్పరం సంధానం అయి ఉన్నటువంటి ప్రస్తుత కాలం లో విపత్తులు మరియు విచ్ఛిన్నాలు కలిగించే ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రపంచం లో ప్రతి ఒక్క దేశం తన వంతు గా ప్రతిఘాత స్వభావాన్ని ఏర్పరచుకొన్నప్పుడు, యావత్తు ప్రపంచం ఉమ్మడి గా విపత్తుల ను ఎదుర్కొనే సత్తా ను సంపాదించుకోగలుగుతుంది. నష్ట భయాలు అనేవి ఉమ్మడి గా ఉంటున్న కారణం గా ఆటుపోటుల కు తట్టుకొని నిలచే ప్రణాళిక అనేది కూడా ఉమ్మడి గా ఆచరించడం ముఖ్యం. ఈ విధమైనటువంటి సమష్టి ఆశయ సాధన లో సిడిఆర్ఐ మరియు ఈ సమావేశం మనకు సహాయకారి గా ఉంటాయి.
మిత్రులారా,
ఉమ్మడి ప్రతిఘాత శక్తి ని సంపాదించుకోవడాని కి మనం అత్యంత బలహీనమైన వర్గాల కు సమర్థన ను అందించే తీరాలి. ఉదాహరణ కు తీసుకొంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి చిన్న ద్వీప దేశాలు తీవ్రమైన విపత్తుల సంబంధి నష్ట భయాన్ని కలిగి ఉన్నాయి. ఆ కోవ కు చెందిన 13 దేశాల కు ఆర్థిక సహాయాన్ని అందించే ప్రాజెక్టుల తో కూడిన ఒక కార్యక్రమాన్ని సిడిఆర్ఐ సిద్ధం చేసింది. డొమినికా లో ప్రకృతి విపత్తుల ను తట్టుకొని నిలబడేటటువంటి ఇళ్ళ నిర్మాణం, పాపువా న్యూ గినీ లో ఇదే తరహా రవాణా నెట్ వర్క్ ల కల్పన, మరి డొమినికన్ రిపబ్లిక్ లో మరియు ఫిజీ లో అధిక సామర్థ్యం కలిగిన ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ఏర్పాటు అనేది ఈ దిశ లో కొన్ని ఉదాహరణలు గా చెప్పుకోవచ్చును. గ్లోబల్ సౌథ్ దేశాల పట్ల సైతం సిడిఆర్ఐ దృష్టి ని కేంద్రీకరించడం బాగుంది.
మిత్రులారా,
జి-20 సభ్యత్వ దేశాల కు అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నిర్వహించిన కాలం లో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడమైంది. ఒక క్రొత్త డిజాస్టర్ రిస్క్ రిడక్శన్ వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేయడమైంది. సిడిఆర్ఐ యొక్క వృద్ధి తో పాటే తీసుకొన్న ఆ తరహా చర్యలు ప్రపంచాన్ని ఒక భద్రమైన భవిత వైపునకు తీసుకొని పోతాయి. ఐసిడిఆర్ఐ లో ఫలప్రదమైన చర్చోప చర్చలు రాగల రెండు రోజుల లో చోటు చేసుకొంటాయి అని నేను నమ్ముతున్నాను. మీకు ధన్యవాదాలు. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
***