పులుల సంరక్షణ కోసం భారతదేశం కేంద్రంగా అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ (ఐబీసీఏ) కోసం, 2023-24 నుంచి 2027-28 వరకు, ఐదేళ్ల కాలానికి రూ.150 కోట్ల ఏకకాలిక బడ్జెట్ కేటాయింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం అంగీకరించింది. ఐబీసీఏ ప్రధాన కార్యాలయాన్ని భారత్‌లో ఏర్పాటు చేస్తారు.
పులులు, ఇతర పెద్ద పిల్లులు సహా అంతరించిపోతున్న అనేక జాతుల పరిరక్షణలో భారతదేశం ప్రముఖ పాత్రను పోషిస్తోంది. ప్రపంచ పులుల దినోత్సవం, 2019 ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించిన శ్రీ నరేంద్ర మోదీ, ఆసియాలో పులుల వేటను అరికట్టడానికి ప్రపంచ దేశాలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశం ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ టైగర్’ 50వ వార్షికోత్సవం సందర్భంగా, 2023 ఏప్రిల్ 09న దీనిని పునరుద్ఘాటించిన ప్రధాని, పెద్ద పిల్లుల భవిష్యత్‌ను సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పులులు, ఇతర పెద్ద పిల్లుల సంరక్షణ కోసం భారత్‌లో అభివృద్ధి చేసిన విధానాలు, పద్ధతులను ఇతర దేశాలు కూడా అనుకరించవచ్చు.
ఏడు పెద్ద పిల్లుల జాతుల్లో పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్, చీతా ఉన్నాయి. వీటిలో పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, చీతా మన దేశంలో కనిపిస్తాయి.
‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ అనేది 96 దేశాలు, సంస్థల కూటమి. ఇందులో, పెద్ద పిల్లులు కనిపించే దేశాలు, వాటి సంరక్షణలో ఆసక్తి ఉన్న ఇతర దేశాలు, పెద్ద పిల్లుల పరిరక్షణ రంగంలో పనిచేస్తున్న శాస్త్రీయ సంస్థలు ఉంటాయి. దీనికి అదనంగా, వ్యాపార సమూహాలు & కార్పొరేట్లతో ఒక నెట్‌వర్క్‌ను స్థాపించడానికి, కేంద్రీకృత పద్ధతిలో సహకారాన్ని పెంచడానికి వాటిని ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావచ్చు. తద్వారా, పెద్ద పిల్లుల జనాభాలో క్షీణతను అడ్డుకోవడానికి, క్రమంగా పెంచేందుకు పరిరక్షణ అజెండాలను బలోపేతం చేసేలా, ఆర్థిక మద్దతుతో కూడిన విజయవంతమైన విధానాలను, సిబ్బందిని ఉపయోగించవచ్చు. ఆయా దేశాలను, సంస్థలను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి పెద్ద పిల్లుల అజెండాలో భారతదేశ నాయకత్వ స్థానానికి ఇది నిదర్శనం.
పెద్ద పిల్లుల సంరక్షణను కొనసాగించడంలో పరస్పర ప్రయోజనం కోసం ఆయా దేశాల మధ్య పరస్పర సహకారాన్ని నెలకొల్పడం ఐఎఫ్‌సీఏ లక్ష్యం. విజ్ఞానాన్ని పంచుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, నెట్వర్కింగ్, చట్టాలు, ఆర్థిక & వనరుల మద్దతు, పరిశోధన & సాంకేతిక మద్దతు, విద్య & అవగాహన పెంచడం వంటి వివిధ విషయాల్లో ఐబీసీఏ సాయపడుతుంది. స్థిరమైన అభివృద్ధి & జీవనోపాధి భద్రతకు ప్రతిరూపాలుగా పెద్ద పిల్లులు ఉంటాయి కాబట్టి, భారతదేశం సహా కూటమి దేశాలు పర్యావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పుల తగ్గింపుపై ప్రధాన ప్రయత్నాలు ప్రారంభిస్తాయి.
‘గోల్డ్ స్టాండర్డ్’ పెద్ద పిల్లుల పరిరక్షణ విధానాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం, ఉమ్మడి సాంకేతిక పరిజ్ఞానాలు & నిధులను అందుబాటులో ఉంచడం, ఇప్పటికే ఉన్న జాతుల-నిర్దిష్ట అంతర్జాతీయ వేదికలు, నెట్‌వర్క్‌లు, పరిరక్షణపై అంతర్జాతీయ కార్యక్రమాలను బలోపేతం చేయడం కోసం ఐసీఏ సహకార వేదికల ద్వారా సమన్వయాన్ని ఐబీసీఏ నిర్ధరిస్తుంది.
వివిధ రంగాల్లో విస్తృతంగా మారడం, అనుసంధానాలను ఏర్పరచడంలో బహుముఖ విధానాన్ని ఐసీఏ విధివిధానాలు అవలంబిస్తాయి. విజ్ఞానాన్ని పంచుకోవడం, సామర్థ్యాన్ని పెంచడం, నెట్వర్కింగ్, చట్టాలు, ఆర్థిక & వనరుల మద్దతు, పరిశోధన & సాంకేతికతల సాయం, వైఫల్యాలకు వ్యతిరేకంగా బీమా, విద్య & అవగాహన వంటి వాటిపై సాయం చేస్తుంది. కూటమి దేశాల్లోని ప్రచారకర్తలు ఈ ఆలోచనను ప్రోత్సహించడంలో ముందుంటారు. మొత్తం ప్రక్రియలో కీలక వర్గంగా ఉన్న యువత & స్థానిక సంఘాలు, ప్రజల్లోకి పెద్ద పిల్లుల సంరక్షణ ప్రచారాలను తీసుకెళతారు. అందువల్ల, పెద్ద పిల్లుల కూటమి సభ్యుల మధ్య ఉండే ప్రేరణలు భాగస్వాముల పరిరక్షణ & శ్రేయస్సు ముఖచిత్రాన్ని మార్చగలవు.
సంపూర్ణ & సమగ్రమైన పరిరక్షణ ఫలితాలను సాధించడానికి, ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల’తో (ఎస్డీజీలు) జీవ వైవిధ్య విధానాలను సమగ్రపరిచాల్సిన ప్రాముఖ్యతను ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్’ గుర్తించింది. స్థానిక అవసరాలతో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రయత్నాలను అనుసంధానించే, ఐసీఏ సభ్య దేశాల్లో ఐక్యరాజ్యసమితి ఎస్డీజీల సాధనకు దోహదపడే విధాన కార్యక్రమాలకు అవి మద్దతుగా నిలుస్తాయి. ప్రాంతీయ విధానాలు & అభివృద్ధి ప్రణాళిక ప్రక్రియల్లో జీవ వైవిధ్యాన్ని ఏకీకృతం చేయడానికి జీవ వైవిధ్యాన్ని అన్ని రంగాల్లో విధాన & అభివృద్ధి ప్రణాళికల ప్రక్రియల్లో ప్రధాన చర్యగా మార్చడం ముఖ్యోద్దేశం. వ్యవసాయం, అటవీ, పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా స్థిరమైన భూ వినియోగ నమూనాలు, నివాస పునరుద్ధరణ కార్యక్రమాలు, జీవవైవిధ్య పరిరక్షణకు మద్దతు ఇచ్చే పర్యావరణ వ్యవస్థ ఆధారిత విధానాలను ప్రోత్సహించడం, వాతావరణ మార్పు, ఆహార భద్రత, స్వచ్ఛమైన నీటికి సంబంధించి ఎస్డీజీలను అందించడం ఇందులో ఉంటాయి.
ఐసీఏ పాలన యంత్రాంగంలో సభ్యుల అసెంబ్లీ, నిర్వహణ కమిటీ, సచివాలయం ఉంటాయి. భారతదేశంలో ప్రధాన కార్యాలయం ఉంటుంది. ‘ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ అగ్రిమెంట్’ను (శాసనం) ప్రధానంగా అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) నమూనా ఆధారంగా రూపొందించారు, అంతర్జాతీయ స్టీరింగ్ కమిటీ (ఐఎస్సీ) దానిని ఖరారు చేస్తుంది. ఐఎస్ఏ, భారత ప్రభుత్వానికి అనుగుణంగా అతిథ్య దేశ ఒప్పందానికి రూపకల్పన జరిగింది. వ్యవస్థాపక సభ్య దేశాల నుంచి ప్రతిపాదించిన జాతీయాంశాల ద్వారా నిర్వహణ కమిటీ ఏర్పాటవుతుంది. తన సొంత డీజీని ఐబీసీఏ నియమించుకునే వరకు, MoEFCC సచివాలయం తాత్కాలిక అధిపతిగా డీజీ నియమిస్తుంది. మంత్రివర్గం స్థాయిలో, ఐబీసీఏ అసెంబ్లీకి హెచ్‌ఎంఈఎఫ్‌సీసీ అధ్యక్షుడు సారథ్యం వహిస్తారు.
ఐబీసీఎ కోసం, ఐదు సంవత్సరాలకు (2023-24 నుంచి 2027-28 వరకు) భారత ప్రభుత్వం రూ.150 కోట్ల ప్రాథమిక నిధి ఇస్తుంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక సంస్థల ద్వారా అందించే నిధులు, ఇతర అర్హత గల సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ & అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, దాత సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని సమీకరిస్తారు.
సహజ వనరుల స్థిరమైన వినియోగం జరుగేలా ఈ కూటమి చూస్తుంది, వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తగ్గిస్తుంది. పెద్ద పిల్లులను, వాటి ఆవాసాలను రక్షించడం ద్వారా, సహజ వాతావరణ అనుకూలత, నీరు & ఆహార భద్రత, ఈ వ్యవస్థలపై ఆధారపడిన వేలాది సంఘాల శ్రేయస్సుకు ఐసీఏ దోహదం చేస్తుంది. పరస్పర ప్రయోజనాల కోసం వివిధ దేశాల మధ్య సహకారాన్ని ఐబీసీఏ ఏర్పాటు చేస్తుంది, దీర్ఘకాలిక సంరక్షణ సూత్రాలను ముందుకు తీసుకెళ్లడంలో గణనీయంగా దోహదపడుతుంది.
***
The Cabinet decision on the establishment of the International Big Cat Alliance, headquartered in India, marks a major step towards conserving our majestic big cats and their habitats, and also reinforcing India's leadership in global biodiversity conservation.… https://t.co/iRVQLQJQyw
— Narendra Modi (@narendramodi) February 29, 2024