Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంజినీర్ లకు ఇంజినీర్స్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి; ఎం. విశ్వేశ్వ‌ర‌య్య కు ఆయ‌న జ‌యంతి నాడు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి


ఇంజినీర్స్ డే సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇంజినీర్ లకు శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ప్ర‌ధాన మంత్రి స‌ర్ ఎం. విశ్వేశ్వ‌ర‌య్య జ‌యంతి ని పుర‌స్క‌రించుకుని ఆయ‌న కు నివాళుల ను అర్పించారు.

“ఇంజినీర్లు శ్రద్ధ కు మ‌రియు దృఢ నిశ్చయాని కి మ‌రో పేరు. వారి లో నూత‌న ఆవిష్క‌ర‌ణ సంబంధిత ఉత్సాహం కొర‌వ‌డితే మాన‌వ పురోగ‌తి అసంపూర్తి గా ఉంటుంది. ఇంజినీర్స్ డే సంద‌ర్భం గా మ‌న ఇంజినీర్లు అంద‌రికీ ఇవే శుభాకాంక్ష‌లు. శ్రమించే తత్త్వాన్ని కలిగివున్న ఇంజినీర్ లకు భవిష్యత్తు ఉజ్వ‌లంగా ఉండాల‌ని నేను అభిలషిస్తున్నాను. మార్గ‌ద‌ర్శ‌క ఇంజినీర్ అయిన‌టువంటి స‌ర్ ఎం. విశ్వేశ్వ‌ర‌య్య గారి కి ఆయ‌న జ‌యంతి సంద‌ర్భం గా నేను నివాళులు అర్పిస్తున్నాను” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.