Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇంజినీర్స్ డే నాడు ఇంజినీర్ లకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ఇంజినీర్స్ డే సందర్భం లో ఇంజినీర్ లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మార్గదర్శకమైనటువంటి తోడ్పాటు ను అందించిన స‌ర్ ఎమ్. విశ్వేశ్వ‌ర‌య్య ను కూడా ఇంజినీర్స్ డే నాడు శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

ప్రధాన మంత్రి పలు ట్వీట్ లలో –

‘‘ఇంజినీర్ లు అందరికీ #EngineersDay సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. దేశ నిర్మాణాని కి సేవల ను అందిస్తున్నటువంటి నిపుణులైన మరియు ప్రతిభావంతులైన ఇంజినీర్ ల సమూహాన్ని కలిగి ఉండటం మన దేశ ప్రజల కు దక్కిన అదృష్టం. మా ప్రభుత్వం కొత్త కొత్త ఇంజినీరింగ్ కళాశాల లను ఏర్పాటు చేయడం సహా ఇంజినీరింగ్ విద్య ను అభ్యసించడం కోసం అవసరమైన మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచేందుకు కూడా కృషి చేస్తోంది.’’

‘‘#EngineersDay నాడు, మనం సర్ ఎం. విశ్వేశ్వరయ్య యొక్క అపూర్వమైనటువంటి తోడ్పాటు ను స్మరించుకొందాం. ఆయన ఇంజినీర్ ల రాబోయే తరానికి వారు తమను తాము విశిష్టమైన వారు గా తీర్చిదిద్దుకొనేటట్టు ప్రేరణ ను కలిగిస్తూనే ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇదివరకటి #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమాల లో భాగమైన ఒక కార్యక్రమం లో ఈ విషయాన్ని గురించి నేను మాట్లాడినటువంటి ఒక భాగాన్ని కూడా శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH