ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఆహార భద్రత, సంబంధిత ఇతర అంశాలలో సహకారానికి ఫుడ్ సేఫ్టీ , స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా( ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (ఎం.ఒ.హెచ్,ఎఫ్.డబ్ల్యు), ఆఫ్ఘనిస్థాన్ వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్థక మంత్రిత్వశాఖ ల మధ్య ఒక సహకార ఒప్పందంపై సంతకం చేసేందుకు అనుమతి మంజూరు చేసింది.
పరస్పర సహకారానికి సంబంధించి కింది అంశాలు ఉన్నాయి.
సమాచారం ఇచ్చిపుచ్చుకునే , కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటు.
ఎ. దిగుమతులకు సంబంధించిన ప్రక్రియలు, నాణ్యతా నియంత్రణా చర్యలు, నమూనాల సేకరణ, పరీక్షలు నిర్వహించడం, ప్యాకేజింగ్, లేబిలింగ్ వంటి పరస్పర ఆసక్తిగల గుర్తించిన అంశాలపై సాంకేతిక సమాచార మార్పిడికి అవకాశం కల్పించడం,
బి. సంయుక్త సదస్సులు, వర్క్‌షాప్‌లు, క్షత్రస్థాయి పర్యటనలు, ఉపన్యాసాల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ తదితరాలకు వీలు
కల్పించడం,
సి. ఒప్పందంలో పాలుపంచుకునేవారి బాధ్యతలకు లోబడి, వారి ఆసక్తికి అనుగుణంగా ఇతర అంశాల విషయంలోనూ వారు పరస్పరం చర్చించి నిర్ణయించుకోవచ్చు. ఈ సహకార ఏర్పాటులో, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, శిక్షణ, సామర్ధ్యాల పెంపు చర్యలు, ఆహారభద్రతను మెరుగుపరిచేందుకు ఒకరు అనుసరించే మంచి విధానాలను మరొకరు నేర్చుకోవడం వంటివి ఉన్నాయి.