Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మాల్కమ్ టర్న్ బుల్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మాల్కమ్ టర్న్ బుల్ తో ఫోన్ లో సంభాషించారు.

శ్రీ టర్న్ బుల్ ఇటీవల భారతదేశంలో తన పర్యటన విజయవంతమైనందుకుగాను ప్రధాన మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

వృత్తి నిపుణుల వీసా కార్యక్రమంలో ఆస్ట్రేలియా ఇటీవల చేసిన మార్పులు చూపగల ప్రభావాన్ని ప్రస్తావించి ప్రధాన మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఉభయ పక్షాలకు చెందిన అధికారులు సన్నిహితంగా సంప్రతింపులు జరుపుతూ ఉండాలని ఇరువురు ప్రధానులు అంగీకారానికి వచ్చారు.

శ్రీ టర్న్ బుల్ కిందటి నెల భారతదేశాన్ని సందర్శించిన తరువాత చేపట్టవలసిన తదుపరి కార్యాచరణను గురించి, ఇంకా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యల గురించి కూడా ఉభయ ప్రధానులు చర్చించారు.