ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ తో కలసి 2023 మే నెల 24 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో గల ఎడ్ మిరల్టీ హౌస్ లో ఒక ద్వైపాక్షిక సమావేశం తో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఎడ్ మిరల్టీ హౌస్ కు చేరుకోవడం తోనే ఆయన కు సాదర స్వాగతం పలకడంతో పాటుగా గౌరవ వందనాన్ని కూడా ఇవ్వడం జరిగింది.
నేత లు ఇద్దరు 2023వ సంవత్సరం మార్చి నెల లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఒకటో ఏన్యువల్ లీడర్స్ సమిట్ సార్థకం అయిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. బహు పార్శ్వాలు కలిగినటువంటి ఇండియా-ఆస్ట్రేలియా కాంప్రిహెన్సివ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా విస్తరించడాని కి మరియు గాఢతరం గా తీర్చిదిద్దడాని కి వారి వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.
చర్చల లో భాగం గా రక్షణ మరియు భద్రత; వ్యాపారం మరియు పెట్టుబడులు; నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ముఖ్య ఖనిజాలు, విద్య, ప్రవాసం, ఇంకా గతిశీలత మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల లో సహకారం పైన దృష్టి ని కేంద్రీకరించడమైంది.
ఇండియా- ఆస్ట్రేలియా మైగ్రేశన్ ఎండ్ మొబిలిటీ పార్ట్ నర్ శిప్ అరేంజ్ మెంట్ (ఎమ్ఎమ్ పిఎ) పై సంతకాలు పూర్తి కావడాన్ని ఇద్దరు నేత లు స్వాగతించారు. దీనితో విద్యార్థులు, వృత్తినిపుణులు, పరిశోధకులు, విద్య రంగ నిపుణులు మరియు తదితరులు విరివి గా రాకపోక లు జరపడాని కి మార్గం సుగమం అవుతుంది. దీనిలో ప్రత్యేకించి భారతదేశం కోసం రూపొందించినటువంటి ఎమ్ఎటిఇఎస్ (మొబిలిటీ అరేంజ్ మెంట్ ఫార్ టాలంటెడ్ అర్లి ప్రొఫెశనల్స్ స్కీమ్) పేరు గల పథకం తాలూకు ఒక నూతన నైపుణ్య మార్గం కూడా ఒక భాగం గా ఉన్నది.
వారు ఇండియా-ఆస్ట్రేలియా హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ యొక్క సందర్భం తాలూకు షరతులు ఖాయం కావడాన్ని సైతం స్వాగతించారు. దీని ద్వారా స్వచ్ఛ హైడ్రోజన్ నిర్మాణం మరియు ఉపయోగం లో శీఘ్రత కు గల అవకాశాలు సరళతరం కాగలవు. అంతేకాకుండా హైడ్రోజన్ ఇలెక్ట్రోలైజర్ స్, ఫ్యూయల్ సెల్స్ విషయం లో శ్రద్ధ వహించడానికి తోడు మౌలిక సదుపాయాల కల్పన మరియు ప్రమాణాలు, ఇంకా నియంతణల కు కూడా సమర్ధన లభించనుంది.
బ్రిస్బేన్ లో భారతదేశ యొక్క ప్రధాన వాణిజ్య దూత కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం లో సహాయాన్ని అందించిన ఆస్ట్రేలియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను తెలియ జేశారు.
ఇద్దరు నేత లు నియమాల పై ఆధారపడి ఉండే అంతర్జాతీయ వ్యవస్థ కు అనుకూలం గా వ్యవహరించగల శాంతిపూర్ణమైనటువంటి, సమృద్ధమైనటువంటి మరియు సంబంధి వర్గాలు అన్నింటి ని కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ ను ఆవిష్కరించాలి అనే తమ దృఢ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. వారు ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో సంస్కరణల అంశాన్ని గురించి కూడా చర్చించారు.
జి20 కి భారతదేశం అధ్యక్షత వహిస్తూ ఉండడానికి మరియు తత్సంబంధి కార్యక్రమాల కు ఆస్ట్రేలియా పక్షాన గట్టి సమర్థన ను ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తాను 2023 సెప్టెంబర్ నెల లో న్యూ ఢిల్లీ లో జరుగనున్న జి20 శిఖర సమ్మేళనం లో ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీజ్ కు స్వాగతం పలకడం కోసం ఆశపడుతున్నట్లు పేర్కొన్నారు.
***
Today’s talks with PM @AlboMP were comprehensive and wide-ranging. This is our sixth meeting in the last one year, indicative of the warmth in the India-Australia friendship. In cricketing terminology- we are firmly in T-20 mode! pic.twitter.com/uD2hOoDL6H
— Narendra Modi (@narendramodi) May 24, 2023