ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం మే 23 వ తేదీ నాడు ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో ఆస్ట్రేలియన్ సూపర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ పాల్ శ్రోడర్ తో సమావేశమయ్యారు.
ప్రపంచం లో విదేశీ పెట్టుబడుల కు అందరికీ తెగ నచ్చేటటువంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థల లో ఒకటి గా భారతదేశాని కి గల విశ్వసనీయత ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. దీనితో పాటు భారతదేశం తో భాగస్వామ్యం నెలకొల్పుకోవలసిందంటూ ఆస్ట్రేలియన్ సూపర్ ను ఆహ్వానించారు.
ఆస్ట్రేలియన్ సూపర్ అనేది ఆస్ట్రేలియా లోని ఒక పెన్శన్ ఫండ్. దీని ప్రధాన కేంద్రం విక్టోరియా లోని మెల్ బర్న్ లో ఉంది.
***
PM @narendramodi met Mr. @Paul__Schroder, CEO of @AustralianSuper. He spoke about India's rapidly growing economy and urged to explore more investment opportunities in the country. pic.twitter.com/WFvbZFYELs
— PMO India (@PMOIndia) May 23, 2023