Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడోత్సవాల్లో రజత పతకం సాధించిన షాట్ పుష్ అథ్లెట్ రవి రొంగాలికి పిఎం అభినందనలు


ఆసియా పారా క్రీడోత్సవాల్లో  పురుషుల షాట్  పుట్  F40 ఈవెంట్  లో రజత పతకం సాధించిన షాట్  పుట్ అథ్లెట్   రవి రొంగాలికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

రవి ఒక స్ఫూర్తి అని పేర్కొంటూ ఆయన విజయాన్ని ప్రశంసించారు.  

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేశారు.

‘‘పురుషుల షాట్  పుట్  F40 ఈవెంట్  లో అద్భుతమైన  రజత పతకం సాధించిన రవి రొంగాలి ప్రతిభను  హృద‌యపూర్వకంగా అభినందిస్తున్నాను.

రవి ఎందరికో స్ఫూర్తి. అతని అద్భుతమైన విజయం అసాధారణ శక్తి, అంకిత భావానికి ఒక పరీక్ష’’ అని పేర్కొన్నారు.