Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారా క్రీడోత్సవాల్లో P2-మహిళల 10ఎం ఎయిర్ పిస్టల్ SH1 విభాగంలో కాంస్య పతకం సాధించిన షూటర్ రూబినా ఫ్రాన్సిస్ కు పిఎం అభినందనలు


ఆసియా పారా క్రీడోత్సవాల్లో P2-మహిళల 10ఎం ఎయిర్  పిస్టల్  SH1 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన షూటర్  రూబినా ఫ్రాన్సిస్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

రూబినా చెక్కు చెదరని అంకిత భావాన్ని, పట్టుదలను ఆయన అభినందిస్తూ ఆమెకు భవిష్యత్  ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియా పారా క్రీడోత్సవాల్లో P2-మహిళల 10ఎం ఎయిర్  పిస్టల్  SH1 ఈవెంట్ లో షూటర్  రూబినా ఫ్రాన్సిస్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది.

రూబినా చెక్కు చెదరని అంకిత భావం, పట్టుదల దీన్ని సాధ్యం చేసింది. భవిష్యత్  క్రీడోత్సవాల్లో ఆమె విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.