Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ ‘రోయింగ్’లో రజతం గెలిచిన అనిత.. నారాయణ కొంగనపల్లె జంటకు ప్రధాని అభినందన


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ ‘రోయింగ్‌’లో రజత పతకం సాధించిన అనిత, నారాయణ కొంగనపల్లె జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ సందర్భంగా వారి సమష్టి కృషిని, అంకితభావాన్ని ఆయన కొనియాడారు. వారు సాధించిన విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“రోయింగ్ పిఆర్‌-3 మిక్స్‌డ్ డబుల్ స్కల్స్‌’ విభాగంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించి రజత పతకం సాధించిన అనిత, నారాయణ కొంగనపల్లె జోడీకి నా అభినందనలు. వారి సంయుక్త  కృషి, అంకితభావం ఈ విజయానికి దోహదం చేశాయి! వారు సాధించిన ఘనత దేశం గర్వించేలా చేసింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.