చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ మహిళల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం సాధించిన తులసిమతి మురుగేశన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఎస్‌యు-5’లో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న తులసిమతి మురుగేశన్‌కు అభినందనలు. ప్రతి భారతీయుడూ గర్వపడేలా ఆమె సాధించిన ఈ విజయం భవిష్యత్తరం క్రీడాకారులకూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations @Thulasimathi11 for the Gold Medal victory in the Badminton Women's Singles SU5 event. Her success makes every Indian proud and will motivate upcoming athletes. pic.twitter.com/zCKV5pTicy
— Narendra Modi (@narendramodi) October 27, 2023