Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో రజత విజేతలు చిరాగ్‌ బరేతా.. రాజ్‌కుమార్‌లకు ప్రధాని అభినందన


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌ ఎస్‌యు-5’లో రజత పతకం సాధించిన చిరాగ్ బరేతా, రాజ్‌కుమార్‌ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ పోటీలో వారిద్దరి సమష్టి కృషి స్ఫూర్తిదాయకమని ఆయన ప్రశంసించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల ‘బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌యు-5’లో రజత పతకం సాధించిన చిరాగ్ బరేతా, రాజ్‌కుమార్‌ జంట @ChiragBaretha and @Rajkuma29040719కు అభినందనలు! భవిష్యత్తులోనూ వారు మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.