Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్లో స్వర్ణం సాధించిన నితీష్‌కుమార్‌.. తరుణ్‌ థిల్లాన్‌లకు ప్రధాని అభినందన


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్‌ ఎస్‌ఎల్‌-3, 4లో స్వర్ణ పతకం సాధించిన నితీష్ కుమార్, తరుణ్ థిల్లాన్‌ జోడీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ తుదిపోరులో వారి సమష్టి కృషిని ప్రశంసిస్తూ, భవిష్యత్తరం క్రీడాకారులకు ఇదొక విశిష్ట ఉదాహరణగా నిలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ ఎస్‌ఎల్‌3, 4’ విభాగంలో ప్రతిష్టాత్మక స్వర్ణం సాధించిన నితీష్ కుమార్, తరుణ్ థిల్లాన్‌లకు నా అభినందనలు. వారి సమష్టి కృషి, ప్రతిభ భవిష్యత్తరం క్రీడాకారులకు ఒక అద్భుత ఉదాహరణగా నిలుస్తాయి. యావద్భారతం ఈ జంట ప్రతిభ పట్ల గర్విస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.