Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజతం గెలిచిన నితీష్‌కుమార్‌కు ప్రధాని అభినందన


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌ ఎస్‌ఎల్‌-3’లో రజత పతకం కైవసం చేసుకున్న నితీష్ కుమార్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. ఈ పోటీలో కుమార్‌ దృఢ సంకల్పంతోపాటు అద్భుత ప్రతిభను ప్రదర్శించాడని ఆయన కొనియాడారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల ‘బ్యాడ్మింటన్ సింగిల్స్ ఎస్‌ఎల్‌-3’లో రజత పతకం గెలుచుకున్న నితీష్ కుమార్‌కు అభినందనలు! అతడు కొట్టిన ప్రతి షాట్‌లోనూ నిబద్ధత, నైపుణ్యం స్పష్టంగా కనిపించాయి. భవిష్యత్తులో అతడు మరింత మెరుగైన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.