Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘చదరంగం’లో స్వర్ణం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి అభినందనలు


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన దర్పణ్ ఇనానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయుల విశేష ప్రతిభకు అతని విజయం తార్కాణమని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో స్వర్ణ పతక విజేత దర్పణ్ ఇనాని అద్భుత ప్రతిభకు అభినందనలు. అద్వితీయ మేధా పటిమ, దృఢ సంకల్పంతో అగ్రస్థానంలో నిలిచిన దర్పణ్‌, స్వర్ణం కైవసం చేసుకోవడం ద్వారా భారతీయుల విశిష్ట ప్రతిభను అంతర్జాతీయ వేదికపై చాటడం మనందరికీ గర్వకారణం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.