Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా పారాగేమ్స్‌ ‘చదరంగం’లో స్వర్ణ పతక విజేతలు దర్పణ్ ఇనాని.. సౌండ్ర్య ప్రధాన్.. అశ్విన్లకు ప్రధాని ప్రశంస


   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన దర్పణ్ ఇనాని, సౌండ్ర్య ప్రధాన్, అశ్విన్‌లను ప్రధాని ప్రశంసించారు. ఈ విజయం సాధించడంలో వారు అద్వితీయ ప్రతిభ, అంకితభావం ప్రదర్శించారని, భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని శ్రీ మోదీ ఆకాక్షించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“పురుషుల ‘చదరంగం బి-1’ (జట్టు) విభాగంలో స్వర్ణ పతక విజేతలు దర్పణ్ ఇనాని, సౌండ్ర్య ప్రధాన్, అశ్విన్‌లకు నా అభినందనలు. వారి నైపుణ్యం, అంకితభావం చూసి నేనెంతో గర్విస్తున్నాను. రానున్న రోజుల్లోనూ వారి మరింత ప్రకాశించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.