Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల సెపక్ తక్రా మహిళల రెగు విభాగంలో కాంస్యం సాధించిన భారత జట్టుకు ప్రధాని అభినందనలు


   సియా క్రీడల‌లో సెపక్‌ తక్రా మహిళల రెగు విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో మహిళల రెగు ఈవెంట్‌లో కాంస్యం సాధించిన మన సెపక్ తక్రా జట్టుకు అభినందనలు! వారి అసాధారణ నైపుణ్యం, అచంచల అంకిత భావం, దృఢ సంకల్పం ఈ పతకం రూపంలో అంతర్జాతీయ వేదికపై ప్రకాశించాయి. వారు సాధించిన ఈ అద్భుత  విజయాన్ని యావద్దేశం వేడుక చేసుకుంటుంది!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.