ఆసియా క్రీడల మహిళల 5000 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడాకారిణి పారుల్ చౌదరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందించారు. ఈ మేరకు ఆమె ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం నిజంగా అత్యద్భుతమని, భవిష్యత్తులో ఆమె ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి స్వర్ణ పతకం సాధించడం దేశానికి గర్వకారణం. ఆమె సాధించిన ఈ విజయం అపూర్వం… ఆమె మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతూ భవిష్యత్తులోనూ విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Proud of Parul Chaudhary for winning the Gold Medal in Women’s 5000m event.
— Narendra Modi (@narendramodi) October 3, 2023
Hers was a performance that was truly awe inspiring. May she keep soaring high and sprinting towards success. pic.twitter.com/hmgw1MqnaC