Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల బ్రిడ్జ్ క్రీడలో రజతం సాధించిన భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందన


   సియా క్రీడల  బ్రిడ్జ్‌ క్రీడలో రజత పతకం సాధించిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో అద్భుత ప్రతిభా ప్రదర్శన ద్వారా రజత పతకం సాధించిన భారత పురుషుల బ్రిడ్జ్‌ జట్టుకు నా అభినందనలు. పతక సాధనలో రాజు టోలానీ, అజయ్ ప్రభాకర్ ఖారే, సుమిత్ ముఖర్జీ, రాజేశ్వర్ తివారీ, జగ్గీ శివదాసాని, సందీప్ తక్రాల్ అంకిత భావంతో, చురుకైన మేధస్సుతో ఈ ఘనత సాధించారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.