Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల కుస్తీ పురుషుల 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్ షెరావత్కు ప్రధాని అభినందన


   సియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన అమన్‌ షెరావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. షెరావత్‌ చక్కని నైపుణ్యం ప్రదర్శించి, అద్భుత విజయం సాధించాడంటూ ఆయన ప్రశంసించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 57 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అమన్‌ షెరావత్‌కు అనేకానేక అభినందనలు. అతని తిరుగులేని నైపుణ్యం, పట్టుదల, కఠోర పరిశ్రమ బరిలో ప్రత్యర్థిపై ఘన విజయం సాధించడంలో తోడ్పడ్డాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.