Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియా క్రీడల కబడ్డీలో చారిత్రక స్వర్ణ సాధనపై భారత మహిళా జట్టుకు ప్రధానమంత్రి అభినందన


   సియా క్రీడల కబడ్డీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయంతో స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదొక చారిత్రక ఘట్టం. మన మహిళల కబడ్డీ జట్టు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించి స్వర్ణం కైవసం చేసుకుంది! ఈ విజయం మన మహిళా క్రీడాకారుల పోరాట స్ఫూర్తికి నిదర్శనం. దీనిపై యావద్దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. మన జట్టుకు నా శుభాభినందనలు. భవిష్యత్తులోనూ ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS