Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం

ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం


వరిష్ఠ ప్రధాని శ్రీ మహమ్మద్ నజీబ్ బిన్ తున్ అబ్దుల్ రజాక్,

ఇతర వరిష్ఠుల్లారా!

ఈ సదస్సుకు ఆతిథ్యమిస్తున్నందుకు ప్రధానమంత్రికి నా కృతజ్ఞతలు. అద్భుతమైన ఏర్పాట్లు, గౌరవమర్యాదలకు, ఆసియాన్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సుకు మీరందిస్తున్న సారథ్యానికి నా హృదయపూర్వక అభినందనలు. దెబ్బ మీద దెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడ్డ మలేసియా తన పట్టుదలను, మనోస్థైర్యాన్ని ప్రదర్శించింది. ఆసియా పునరుత్థానానికి, ఈ ప్రాంత ఉజ్జ్వల భవిష్యత్కు కౌలాలంపూర్ ఓ చిహ్నం. ఆసియాన్ సమాజ ఆవిర్భావం అనే ఈ చారిత్రక మైలురాయి సందర్భంగా శుభాభినందనలు.

ఎప్పటిలాగే ప్రాంతీయ సహకారం, సమగ్రతలకు ఆసియాన్ సారథ్యాన్ని, స్ఫూర్తిని అందిస్తోంది. ఆసియా, పసిఫిక్ల మధ్య సమగ్రత బంధానికి ఆసియాన్ విలువలు, సారథ్యం అత్యంత కీలకమని భారత్ విశ్వసిస్తోంది.

వరిష్ఠ నేతల్లారా! నా రెండో ఆసియాన్-భారత్ సదస్సుకు వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నె.పి.తావ్ లో జరిగిన గత సదస్సులో మనమధ్య బాంధవ్యంలోని బలాన్ని, భాగస్వామ్యంలోని సత్తాను చూశాను. భారత్-ఆసియాన్ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మీరు చూపించిన నిబద్ధత, నమ్మకం అన్నింటికంటే ముఖ్యమైంది.

ఆర్థిక అనిశ్చితులు, రాజకీయ సంక్షోబం, భద్రత సవాళ్ళ లాంటి బహుముఖ సవాళ్ళను ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో మనమిప్పుడు సమావేశమవుతున్నాం. అత్యంత సంక్షిష్టమైన ఈ తరుణంలో భారత్, ఆసియాన్లు రెండు ఆశాకిరణాల్లా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ది ప్రముఖ స్థానం. భారతదేశ వృద్ధిరేటు 7.5% తాకుతోంది. మునుముందు మరింత పెరిగే అవకాశముంది. ద్రవ్యోల్బణం తగ్గింది. అలాగే ద్రవ్యలోటు, విదేశీలోటు కూడా తగ్గాయి. వ్యాపారంలో, అంతర్జాతీయంగా మాపై నమ్మకం విపరీతంగా పెరిగింది. భారత్లో మార్పు శరవేగంగా జరుగుతోంది. అదే సమయంలో ఆర్థిక అవకాశాలు కూడా అపారంగా ఉన్నాయి.

బార్లా తలుపులు తెరచి భారత్ అందరినీ ఆహ్వానిస్తోంది. వాణిజ్యానికి అత్యంత అనువైన దేశాల ప్రపంచ బ్యాంకు జాబితాలో భారత ర్యాంకింగ్ అనూహ్యంగా మెరుగవ్వటమే ఇందుకు నిదర్శనం. మా సంస్కరణలను అంతే వేగంగా, ధైర్యంగా కొనసాగిస్తాం.

ఆసియాన్ ఆర్థిక వ్యవస్థ ప్రగతిశీల, శక్తిమంతంగా ముందుకు సాగుతుంది. మన 1.9 బిలియన్ ప్రజలకు శ్రేయస్సునందిస్తామనటంలో నాకెలాంటి సందేహం లేదు.

వరిష్ఠ నేతల్లారా!

కాసింత తాత్కాలిక తిరోగమనం తర్వాత మా వాణిజ్యం 2014-15లో 76.5 బిలియన్ అమెరికా డాలర్లకు వృద్ధి చెందటం సంతోషం కల్గించే విషయం. అదేవిధంగా రెండువైపులా పెట్టుబడులు కూడా! రెండు మార్గాల్లో (వచ్చే, వెళ్ళే)నూ ఆసియాన్ భారీ పెట్టుబడిదారిగా ఉంది. అయితే ఆర్థిక భాగస్వామ్యానికున్న అవకాశాల్ని మనమింకా పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. మన ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందుతున్న కొద్దీ మన వాణిజ్య, పెట్టుబడులు విస్తరిస్తాయని నమ్మకంతో ఉన్నాను.

వరిష్ఠులారా!

పరస్పర సహకారం విషయంలో మన కార్యాచరణ వేగాన్ని చూసినా న మ్మ కం కలుగుతోంది. 2015 జులైలో చేసుకున్న సేవల వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందం ఓ పెద్ద ముందడుగు.

వస్తు సామగ్రి, సేవలతో పాటు పెట్టుబడులకు కూడా వీలు కల్పించే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంప్రదింపుల్లో పురోగతికి ఎదురుచూస్తున్నాం. శ్రేయస్సును పంచుకోవటానికి కనెక్టివిటీయే ప్రధానసాధనం. మంచి పురోగతిలో సాగుతున్న త్రైపాక్షిక రహదారి ప్రాజెక్టు 2018 కల్లా పూర్తికావాలని ఆశిస్తున్నాం. భారత్, ఆసియాన్ ల మధ్య భౌతిక, డిజిటల్ అనుసంధానాన్ని పెంచే ప్రాజెక్టులను ప్రోత్సహించటానికిగాను 1.0 బిలియన్ అమెరికా డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో మాదిరిగానే కంబోడియా, లావోస్, మయన్మార్, వియత్నాంలతో భాగస్వామ్యానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాం. సామర్థ్యం పెంపుదలకుద్దేశించిన ప్రాజెక్టులో వారితో మా భాగస్వామ్యం మరింత విస్తరిస్తాం. అంతేగాకుండా సీఎల్ఎంవీ దేశాల్లో తయారీ కేంద్రాల వృద్దికిగాను ప్రాజెక్టు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం.

వరిష్ఠ నేతల్లారా!

శాస్త్రసాంకేతికత, సృజనాత్మకత మన సహకారంలో, అత్యంత కీలకమైన మూలస్తంభం. అంతేగాకుండా మన ఆర్థిక భాగస్వామ్యానికి కూడా ఇది చేదోడువాదోడుగా ఉంటోంది. అందుకే ప్రస్తుతం మిలియన్ అమెరికన్ డాలర్లతో నడుస్తున్న ఆసియాన్-భారత్ శాస్త్రసాంకేతికాభివృద్ధి నిధిని 5మిలియన్ డాలర్లకు పెంచుతాం. చవకైన సాంకేతికతల వాణిజ్యం కోసం, సాంకేతికత బదిలీ, పరిశోధన అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యాల కోసం ఆసియాన్-భారత్ సృజనాత్మక వేదికను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.

అంతరిక్షరంగంలో సహకారానికి ఉద్దేశించి వియత్నాంలో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు వేగంగా పురోగమిస్తోంది. అది త్వరితగతిన పూర్తవుతుందని నేను హామీ ఇస్తున్నాను. సమాచార సౌకర్యాల్లో, నిర్దిష్ట ప్రాంతాన్ని కనుక్కోవటంలో, దారిచూపటంలో అత్యంత ఆధునిక సేవలందించేందుకు భారత్లో దేశీయంగా రూపొందిన గగన్ (జీపీఎస్ ఆధారిత జియో ఆగుమెంటెడ్ నావిగేషన్) సేవలను కూడా ఆసియాన్కు అందిస్తున్నాం. సముద్ర ఆర్థికరంగంలోనూ మన సుస్థిర అభివృద్ధి సాధించేలా సహకరించుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఇది మన భవిష్యత్ ఆర్థికరంగానికి ప్రధాన చోదకమవుతుంది. ఆహారభద్రతకు, ఔషధాలు, స్వచ్ఛ ఇంధనాలకు వనరవుతుంది. ఈ విషయంలో భారత్ ఇప్పటికే అనేక దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.

వరిష్ఠనేతల్లారా! మన పరిశోధన, సృజనాత్మక యత్నాలన్నీ సాధారణంగా మనమంతా ఎదుర్కొంటున్న- శరవేగంగా విస్తరిస్తున్న నగరీకరణ, మెగాసిటీలు, భవిష్యత్ కోసం నైపుణ్యం, ఆహార భద్రత, నీరు, అందుబాటులో ఆరోగ్యం..- లాంటి సవాళ్ళకు పరిష్కారం చూపించేలా ఉండాలి.

వాతావరణ మార్పనేది ప్రస్తుతం ప్రపంచానికి ఓ సమస్యగా మారింది. స్వచ్ఛ ఇంధనానికి సంబంధించి భారత్ కు ఔత్సాహిక ప్రణాళికలున్నాయి. 2022కల్లా అదనంగా 175 జీడబ్ల్యూ సంప్రదాయేతర ఇంధనం; 2030కల్లా శిలాజేతరాల ద్వారా 40% ఇంధనంలాంటివి ఇందులో ఉన్నాయి. నేతల్లారా…! మా సంస్థల్లో సంప్రదాయేతర ఇంధనంలో 100కు పైగా శిక్షణ కార్యశాలలను కేటాయించటానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాకుండా 122 దేశాలతో కలసి అంతర్జాతీయ సౌర సహకారానికి ప్రతిపాదించాను. నవంబరు 30న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్తో కలసి పారిస్లో దీన్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ ఆవిర్భావంలోనే కాకుండా, ఈ సౌరకూటమిలో మీరు కూడా కలసి రావాలని కోరుకుంటున్నాను.

వరిష్ఠులారా! మన సంబంధాల్లో అత్యంత కీలకమైన సాంస్కృతిక బంధాన్ని పునరుద్ధరించటానికి చేస్తున్న సమష్టి కృషికి నేనెంతో విలువిస్తాను. జులైలో ఆసియాన్, భారత్ సంస్కృతిక సంబంధాలపై ఓ అంతర్జాతీయ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. మా దేశంలో తూర్పుకు దారులు తెరిచే గుమ్మమైన షిల్లాంగ్లోని ఈశాన్య పర్వత విశ్వవిద్యాలయంలో ఆసియాన్ స్టడీస్పై కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.

ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏర్పాటు చేసిన పురావిధ్యార్థుల ప్రతిష్ఠాత్మక తొలి అవార్డు ఈ సంవత్సరం ఆసియాన్ సెక్రటరీ జనరల్ విశిష్ఠ లె లౌంగ్ మిన్ కు లభించిందని తెలియజేయటానికి సంతోషిస్తున్నాను.

త్వరలోనే పది ఆసియాన్ దేశాలకు భారత్ ఎలక్ట్రానిక్ వీసా సౌకర్యాన్ని విస్తరించబోతోంది.

వరిష్ఠ నేతల్లారా! మన భవిష్యత్ శ్రేయస్సంతా మన ప్రాంతంలో భద్రత, సుస్థిరతలు, సముద్రాలు, అంతరిక్షం, సైబర్ ప్రపంచం పై ఆధారపడి ఉంటుంది. 2015 జనవరిలో సైబర్ సెక్యూరిటీ (అంతర్జాల భద్రత)పై మేం ఆతిథ్యమిచ్చిన ఆసియాన్-భారత్ తొలి సదస్సు ఈ రంగంలో మన సహకారాన్ని మరింత వేగవంతం చేయాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ చట్టాలు, సముద్ర చట్టాలపై 1982 ఐక్యరాజ్యసమితి ఒప్పందంలకు లోబడిన నౌకాయాన రాకపోకల స్వేచ్ఛ, వాణిజ్యాలపై ఆసియాన్ నిబద్దతను భారత్ కూడా సమర్థిస్తుంది. శాంతియుత పద్ధతుల్లో సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవాలి. దక్షిణచైనా సముద్రంలో ప్రవర్తనకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలోని మార్గదర్శకాల అమలుకు ఇందులో భాగస్వాములైన దేశాలన్నీ కట్టుబడి ఉంటాయని భారత్ ఆశిస్తోంది. అంతేగాకుండా అందరికీ అంగీకారయోగ్యమైన పద్ధతిలో ప్రవర్తన నియమావళిని చేపట్టేలా ప్రయత్నాలు ముమ్మరం కావాలని కోరుకుంటోంది. సముద్రయాన భద్రత, సముద్ర దోపిడీలను అరికట్టడం, విపత్తు నిర్వహణ, ఉపశమన చర్యల విషయంలో సహకారానికి మనం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలి.

ఇక్కడున్న మనందరినీ ప్రభావితం చేసేలా ఉగ్రవాదమనేది ప్రపంచ సవాలుగా మారింది. ఆసియాన్ సభ్య దేశాలతో మాకు సత్సంబంధాలున్నాయి. ఉగ్రవాదం కట్టడి విషయంలో ప్రాంతీయంగానే కాకుండా, అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందానికి మద్దతివ్వటంతోపాటు అంతర్జాతీయంగా కూడా మన సహకారాన్ని మరింతగా ఎలా పెంచగలుగుతామో చూడాలి.

వరిష్ఠ నేతల్లారా… అనిశ్చితమైన సమయాల నుంచి శాంతి, శ్రేయస్సుల దిశగా వేగంగా మారుతున్న మన ప్రాంతంలో … ఆ మార్పుల రూపకల్పనకు ఆసియాన్ మార్గదర్శనం చేయాలని కోరుకుంటున్నాం. మీరంతా ఈ సదస్సుకు హాజరై ఆసియాన్ భాగస్వామ్యంలో భారత్కు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందుకు గుర్తుగా జకార్తాలోని ఆసియాన్లో శాశ్వత కేంద్రాన్ని మేం ఏర్పాటు చేస్తున్నాం.

ఉమ్మడి అజెండాను మరింతగా ఎలా అభివృద్ధి చేసుకోవాలనే అంశంపై మీ అందరి ఆలోచనలను ఆలకించటానికి నేను ఉత్సాహంతో ఉన్నాను.

ధన్యవాదాలు….