Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక వేత్త శ్రీ నికోలస్ స్టర్న్ తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ లండన్ స్కూల్ ఆఫ్ ఇకనామిక్స్ కు చెందిన అర్థశాస్త్రం ఆచార్యుడు లార్డ్ శ్రీ నికోలస్ స్టర్న్ తో సమావేశమయ్యారు. ఇరువురు ప్రముఖులు ఈ సందర్భం లో వివిధ అంశాల ను గురించి చర్చించారు.

లార్డ్ శ్రీ నికోలస్ స్టర్న్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు గా తాను కూడా ఒక ట్వీట్ లో

‘‘లార్డ్ శ్రీ నికోలస్ స్టర్న్ @lordstern1 తో భేటీ అయ్యి, వివిధ అంశాల పై ఆయన తో చర్చించినందుకు సంతోషం గా ఉంది. పర్యావరణం పట్ల ఆయన కు ఉన్న ఉద్వేగం తో పాటుగా విధాన పరమైనటువంటి అంశాల పై ఆయనకు గల సూక్ష్మ అవగాహన ప్రశంసనీయమైనవి. ఆయన భారతదేశం పట్ల ఆశావాదం తో ఉన్నారు అంతేకాక, 130 కోట్ల మంది భారతీయుల నైపుణ్యాలంటే ఆయన కు బరోసా కూడా ఉంది.’’ అని పేర్కొన్నారు.