Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ల మూడోసమావేశం లో భాగం గా ఒక భవ్య రాత్రి భోజన కార్యక్రమం లో భేటీ అయిన మహిళా నేత ల ఛాయాచిత్రాన్నిశేర్ చేసిన ప్రధాన మంత్రి


జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వహిస్తున్న క్రమం లో ఏర్పాటైన ఆర్థిక మంత్రులు మరియు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ల మూడో సమావేశం లో భాగం గా ఏర్పాటైన రాత్రి భోజన కార్యక్రమం లో మహిళా నేత ల భేటీ తాలూకు ఛాయాచిత్రాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ఆర్థిక శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారమణ్ ట్వీట్ ను ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ –

‘‘మన ప్రపంచం యొక్క భవిష్యత్తు కు రూపురేఖల ను ఇవ్వడం లో మహిళ లు పోషిస్తున్నటువంటి ముఖ్య భూమిక ను ప్రముఖం గా ప్రకటించే చాలా ప్రేరణదాయకం అయినటువంటి దృశ్యం.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS