ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం భారతదేశానికి, మొరాకో కు మధ్య ఆరోగ్య రంగంలో సహకారానికి ఉద్దేశించిన ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలకు ఆమోదం తెలిపింది.
ఈ కింద పేర్కొన్న రంగాలలో సహకారం ఎమ్ఒయు పరిధిలోకి వస్తుంది:-
i) చిన్నారుల్లో హృదయ నాళికామయ వ్యాధులు మరియు క్యాన్సర్ సహా అసాంక్రామిక వ్యాధులు;
ii) డ్రగ్ రెగ్యులేషన్ అండ్ ఫార్మస్యూటికల్ క్వాలిటీ కంట్రోల్;
iii) తేలికగా సంక్రమించగల వ్యాధులు;
iv) తల్లులు, పిల్లల మరియు అప్పుడే పుట్టిన బిడ్డల ఆరోగ్యం;
v) మంచి పద్ధతులను ఇచ్చిపుచ్చుకోవడం కోసం ఆసుపత్రుల మధ్య అనుబంధం;
vi) ఆసుపత్రులు మరియు ఆరోగ్య సేవల నిర్వహణలోను, పాలనలోను శిక్షణ;
vii) ఇరు పక్షాల నిర్ణయం మేరకు మరేదైనా రంగంలో సహకారం.
ఈ ఎమ్ఒయు యొక్క అమలును పర్యవేక్షించడంతో పాటు, సహకారానికి సంబంధించిన వివరాలను మరింత విస్తరింప చేయడానికి ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తారు.