Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్య రంగంలో సహకారం పై భారతదేశానికి, జర్మనీ కి మధ్య జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ టెంట్ (జెడిఐ) కి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.


ఆరోగ్య రంగంలో సహకారంపై భారతదేశానికి, జర్మనీకి మధ్య జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇన్ టెంట్ (జెడిఐ) కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. ఈ జెడిఐ పై 2017 జూన్ 1వ తేదీన సంతకాలయ్యాయి.

ఈ కింద పేర్కొన్న రంగాలలో పరస్పర సహకారం జెడిఐ పరిధిలో ఉంటుంది:

1). స్నాతకోత్తర విద్య;

2). వైద్య సిబ్బందికి శిక్షణ;

3). ఫార్మాస్యూటికల్స్ మరియు ఫార్మాకోఇకనామిక్స్; ఇంకా

4). హెల్త్ ఇకనామిక్స్.

ఈ జెడిఐ అమలును పర్యవేక్షించడంతో పాటు పరస్పర సహకారానికి సంబంధించిన వివరాలను మరింత విస్తృతపరచేందుకుగాను ఒక వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తారు.