ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్ (జిహెచ్‌టిసి) లో భాగం గా ఆరు రాష్ట్రాల లో ఆరు చోట్ల లైట్ హౌస్ ప్రాజెక్టు (ఎల్‌హెచ్‌పి) లకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు. ఆయన అఫార్డెబల్ సస్ టేనబల్ హౌసింగ్ ఏక్సెలెరేటర్స్-ఇండియా (ఎఎస్ హెచ్ ఎ- ఇండియా) లో విజేత ల పేరులను ప్రకటించడంతో పాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ (పిఎంఎవై-యు) మిశన్ అమలు లో శ్రేష్ఠత్వానికిగాను వార్షిక పురస్కారాలను ప్రదానం చేశారు. అలాగే, ఎన్ఎవిఎఆర్ఐటిఐహెచ్ (‘నవరీతి’.. న్యూ, అఫార్డెబల్, వాలిడేటెడ్, రిసర్చ్, ఇనొవేశన్ టెక్నాలజీస్ ఫార్ ఇండియా హౌసింగ్) పేరు తో నూతన నిర్మాణ సంబంధ సాంకేతిక విజ్ఞానం లో ఒక సర్టిఫికేశన్ కోర్సు ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురీ తో పాటు ఉత్తర్ ప్రదేశ్, త్రిపుర, ఝార్ ఖండ్, తమిళ నాడు, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ల ముఖ్యమంత్రులు కూడా పాలుపంచుకొన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు నూతన పరిష్కారాలను రుజువు చేయడానికి కొత్త శక్తి తో ముందంజ వేయవలసినటువంటి రోజు. అంతేకాక ఈ రోజు న దేశం పేద ప్రజలకు, మధ్య తరగతి కి ఉద్దేశించిన ఇళ్ళ ను నిర్మించడానికి ఒక సరికొత్త సాంకేతికత ను అందుకొంటోందన్నారు. ఈ ఇళ్ళ ను సాంకేతిక పరిభాష లో లైట్ హౌస్ ప్రాజెక్టు లు గా వ్యవహరిస్తున్నారు; కానీ, ఈ ఆరు ప్రాజెక్టు లు నిజం గానే లైట్ హౌసెస్ వంటివి, ఇవి దేశం లో గృహనిర్మాణ రంగానికి ఒక నవీన దిశ ను చూపుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
ఈ లైట్ హౌస్ ప్రాజెక్టు లు ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కి ఒక ఉదాహరణ గా నిలుస్తున్నాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. ఒక దశ లో గృహ నిర్మాణ పథకాలు కేంద్ర ప్రభుత్వానికి అంత ప్రాధాన్యమైనవి గా లేవు అని, గృహ నిర్మాణ పరమైన నాణ్యత ను గురించి, సూక్ష్మాలను గురించి అంతగా పట్టించుకోవడం జరగలేదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం, దేశం ఒక భిన్నమైన ధోరణి ని ఎంపిక చేసుకొందని, ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి ఒక భిన్నమైన మార్గాన్ని అనుసరిస్తోందని, మెరుగైన సాంకేతికత ను అందిపుచ్చుకోవడం జరుగుతోందన్నారు. పెద్దవీ, మందకొడి గా సాగే నిర్మాణాల జోలికి పోకుండా ఉండటానికే ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ప్రాముఖ్యం ఇవ్వాలని, నిర్మాణాలు స్టార్ట్ అప్ ల మాదిరి గా కుదురైనవి గా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 50 కి పైగా వినూత్న నిర్మాణ కంపెనీ లు చురుకు గా పాలుపంచుకోవడం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రపంచ శ్రేణి సవాలు మనకు సరికొత్త సాంకేతిక విజ్ఞానాన్ని రూపొందించి, ఆవిష్కరించేందుకు ఒక అవకాశాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు.
అదే ప్రక్రియ తాలూకు తదుపరి దశ లో, వివిధ ప్రదేశాలలో 6 లైట్ హౌస్ ప్రాజెక్టుల పనులు ఈ రోజు న మొదలవుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టు లు ఆధునిక సాంకేతిక విజ్ఞానంతోను, నూతన ప్రక్రియలతోను రూపుదిద్దుకొంటాయని, ఇవి నిర్మాణ కాలాన్ని తగ్గించి, పేద ల కోసం మరింత ప్రతిఘాతుకత్వం కలిగిన, తక్కువ ఖర్చు లో పూర్తి అయ్యేటటువంటి, సౌకర్యవంతమైన ఇళ్ల ను రూపొందించి ఇస్తాయని వివరించారు. ఈ తేలికపాటి ఇళ్ళు నిర్మాణ సంబంధిత సాంకేతిక విజ్ఞానం లో నూతన పోకడలు పోతాయని కూడా ఆయన వివరించారు. ఉదాహరణ కు తీసుకొంటే ఇందౌర్ లోని ప్రాజెక్టు లో ఇటుకలు, సున్నం వంటివి ఏవీ ఉండవని, వాటికి బదులుగా ఆ ఇళ్ళకు ప్రిఫ్యాబ్రికేటెడ్ శాండ్‌విచ్ ప్యానల్ సిస్టమ్ ను ఉపయోగించడం జరుగుతుందన్నారు. రాజ్ కోట్ లో రూపొందే లైట్ హౌసెస్ ను ఫ్రెంచ్ సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మిస్తారని, వీటి కోసం ఒక సొరంగాన్ని ఉపయోగిస్తూ మోనోలిథిక్ కాంక్రీట్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ ని వినియోగిస్తారని, తద్ద్వారా ఆ ఇళ్ళు విపత్తులకు తట్టుకొని నిలవడంలో అధిక సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. చెన్నై లో నిర్మించే ఇళ్ళకు యుఎస్, ఫిన్‌లాండ్ సాంకేతికతలను ఉపయోగించడం జరుగుతుందని, ఈ పద్ధతి లో వేగం గా, చౌక గా ఇళ్ళను నిర్మించడం సాధ్యపడుతుందని ఆయన అన్నారు. రాంచీ లో ఇళ్ళను జర్మనీ కి చెందిన 3డి కన్‌స్ట్రక్షన్ సిస్టమ్ ను ఉపయోగించి నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క గది ని విడిగా తయారుచేసి, లెగో బ్లాక్స్ ఆట వస్తువుల మాదిరిగానే యావత్తు నిర్మాణాన్ని జత కలపడం జరుగుతుందన్నారు. అగర్ తలా లో నిర్మిస్తున్న ఇళ్ళను ఉక్కు చట్రాల తో న్యూ జీలాండ్ కు చెందిన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొంటూ నిర్మిస్తున్నారని, ఇది పెద్ద భూకంపం సంభవించినా ఆ బెడద ను తట్టుకొని నిలువగలుగుతుందని ఆయన వివరించారు. కెనడా సాంకేతికత ను లఖ్ నవూ లో ఉపయోగిస్తున్నారని, ఈ పద్ధతి లో ప్లాస్టర్, పెయింట్ లతో పని ఉండదని, దీనిలో మొత్తం గోడలను, అప్పటికే తయారుచేసిననవి వినియోగిస్తూ, ఇళ్ళను శరవేగంగా నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క ప్రదేశంలో వేల కొద్దీ ఇళ్ళను 12 నెలల లోపల నిర్మించడం జరుగుతుందని, ఇవి ఇంక్యుబేశన్ సెంటర్ ల లాగా ఉపయోగపడతాయని, వీటిని మన ప్లానర్ లు, భవన శిల్పులు, ఇంజినీర్లు, విద్యార్థులు చూసి నేర్చుకోగలుగుతారని, వారు కొత్త సాంకేతికత తో ప్రయోగాలు చేయగలుగుతారన్నారు. దీనితో పాటు, నిర్మాణరంగం లోని వారికి కొత్త సాంకేతికత కు సంబంధించిన నైపుణ్యాలను పెంచుకోవడం కోసం ఒక సర్టిఫికెట్ కోర్సు ను కూడా ప్రారంభించడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజలు గృహ నిర్మాణ రంగం లో ప్రపంచం లోకెల్లా ఉత్తమమైనటువంటి సామగ్రి ని, సాంకేతిక విజ్ఞానాన్ని అందుకోగలరన్నారు.
దేశం లో ఆధునిక గృహ నిర్మాణ సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి పరిశోధన ను, స్టార్ట్ అప్ లను ప్రోత్సహించడానికిగాను ఎఎస్‌హెచ్ఎ-ఇండియా ప్రోగ్రామ్ ను నిర్వహించడం జరుగుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. దీని ద్వారా 21వ శతాబ్ది గృహాలను నిర్మించడానికి కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని, తక్కువ ఖర్చయ్యే సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశంలోనే అభివృద్ధిచేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా అయిదు సర్వోత్తమ మెలకువలను కూడా ఎంపికచేయడం జరిగిందని ఆయన చెప్పారు. నగర ప్రాంతం లో నివసించే పేదలకు గాని, లేదా మధ్యతరగతి ప్రజలకు గాని అతి పెద్ద కల ఏదీ అంటే అది వారికంటూ ఒక సొంత ఇల్లు అనేది ఉండటమే అని ఆయన అన్నారు. అయితే, కొన్ని సంవత్సరాలుగా ప్రజలు వారి ఇంటి పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన చెప్పారు. విశ్వాసాన్ని ఆర్జించిన తరువాత సైతం అధిక ధరల కారణంగా డిమాండు పడిపోయిందని ఆయన అన్నారు. ఏదైనా ఒక సమస్య తలెత్తితే చట్టపరమైన రక్షణ లభిస్తుందా అనే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయారు అని ఆయన అన్నారు. బ్యాంకు లో అధిక వడ్డీ రేట్లు, రుణాలను పొందడంలో చిక్కులు అనేవి సొంత ఇంటి ని సమకూర్చుకోవాలనే ఆసక్తి ని తగ్గించివేశాయని ఆయన చెప్పారు. ఒక సామాన్యుడు తాను కూడా ఒక సొంత ఇంటి ని సమకూర్చుకోగలననే విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి గడచిన ఆరు సంవత్సరాలలో చేపట్టిన ప్రయత్నాల పట్ల ప్రధాన మంత్రి తన సంతృప్తి ని వ్యక్తం చేశారు. ‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ లో భాగం గా నగర ప్రాంతాల లో అతి కొద్ది కాలంలోనే లక్షలాది ఇళ్ళు నిర్మాణం జరిగిందని ఆయన అన్నారు.
‘పిఎమ్ ఆవాస్ యోజన’ లో నిర్మాణం తాలూకు శ్రద్ధ స్థానిక అవసరాలు, గృహ యజమానుల అపేక్షలకు తగినట్లు అటు నూతన ఆవిష్కరణ, ఇటు అమలు.. ఈ రెండిటి మీద తీసుకోవడం జరుగుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రతి ఒక్క విభాగం (యూనిట్) కు విద్యుత్తును, నీటిని, గ్యాస్ కనెక్షన్ ను జత చేసి తీర్చిదిద్దుతున్నందువల్ల ఇది ఒక సంపూర్ణమైన ప్యాకేజీ గా ఉంటుంది. లబ్ధిదారులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) , జియో-ట్యాగింగ్ వంటి సాంకేతిక విజ్ఞానం ద్వారా పారదర్శకత్వానికి పూచీపడటం జరుగుతోందన్నారు.
మధ్యతరగతి ప్రజలకు కలిగే లాభాలను గురించి శ్రీ మోదీ చెప్తూ, వారు గృహ రుణం వడ్డీ లో తగ్గింపులను పొందుతున్నారని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిన గృహ నిర్మాణ పథకాల కోసం ఏర్పాటు చేసిన 25,000 కోట్ల రూపాయల ప్రత్యేక నిధి కూడా మధ్యతరగతి వర్గాల వారికి సహాయకారి గా ఉండగలదన్నారు. ఆర్ఇఆర్ఎ వంటి చర్యలు గృహ యజమానుల విశ్వాసాన్ని తిరిగి తీసుకువచ్చాయని, వారు వారి కష్టార్జితాన్ని వెచ్చిస్తే మోసపోము అనేటటువంటి నమ్మకాన్ని వారికి ప్రసాదించిందని వివరించారు. ఆర్ఇఆర్ఎ లో భాగంగా నమోదైన పథకాలు 60,000 వరకు ఉన్నాయని, ఈ చట్టం లో భాగంగా వేల కొద్దీ ఇబ్బందులను నివారించడం జరిగిందన్నారు.
ఒక ఇంటి తాళంచెవి ని తీసుకోవడం అంటే అది ఒక నివాస భవనాన్ని స్వాధీనం చేసుకోవడమొక్కటే కాదు, అది గౌరవం, విశ్వాసం, భద్రమైన భవిష్యత్తు, కొత్త గుర్తింపు లతో పాటు అవకాశాల విస్తరణ కు కూడా తలుపులను తెరుస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘అందరికీ గృహ నిర్మాణం’ కోసం జరుగుతున్న సర్వతోముఖ కృషి కోట్ల కొద్దీ పేద ప్రజల జీవితాలలో, మధ్యతరగతి కుటుంబాల జీవితాలలో ఒక సానుకూలమైన పరివర్తన ను తీసుకువస్తోందని ఆయన అన్నారు.
కరోనా మహమ్మారి కాలం లో చేపట్టిన ఒక కొత్త పథకాన్ని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అదే.. అఫార్డబుల్ రెంటింగ్ హౌసింగ్ కాంప్లెక్స్ స్కీము లు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకు వచ్చే శ్రామికులకు ఇళ్ళను న్యాయ సమ్మతమైన అద్దెలకు సమకూర్చడానికి పరిశ్రమతోను, ఇతర ఇన్వెస్టర్లతోను ప్రభుత్వం కలసి పని చేస్తోందని ఆయన చెప్పారు. వారు తలదాచుకొనే పరిస్థితులు చాలా వరకు అపరిశుభ్రంగా ఉండటమే కాక గౌరవ లోపం తో కూడా ఉంటున్నాయన్నారు. ఈ ప్రయాస వారికి వారు పని చేసే ప్రదేశానికి సమీప ప్రాంతాలలోనే సమంజసమైన కిరాయి కి ఆవాసాలను అందించడానికే అని ఆయన అన్నారు. మన శ్రామిక మిత్రులు గౌరవంగా జీవించేటట్లు చూడటం అనేది మన బాధ్యత అని కూడా శ్రీ మోదీ అన్నారు.
రియల్ ఎస్టేట్ రంగానికి సాయపడటానికి ఇటీవల తీసుకొన్న నిర్ణయాలను గురించి కూడా ప్రధాన మంత్రి గుర్తుకుతెచ్చారు. చౌక ఇళ్ళకు పన్నులను 8 శాతం నుంచి 1 శాతానికి తగ్గించడం, జిఎస్‌టి ని 12 శాతం నుంచి 5 శాతానికి కుదించడం, ఈ రంగాన్ని చౌక రుణాల కు అర్హత ను సంపాదించుకొనేదిగా మలచేందుకు మౌలిక సదుపాయాల రంగం గా గుర్తించడం వంటి చర్యలు మన నిర్మాణ అనుమతి సంబంధిత ర్యాంకింగ్ ను 185 వ స్థానం నుంచి 27వ స్థానానికి తీసుకుపోయాయని ఆయన చెప్పారు. 2000కు పైగా పట్టణాలలో నిర్మాణ అనుమతుల ప్రక్రియ ను ఆన్ లైన్ లో చేర్చడం జరిగింది అని ప్రధాన మంత్రి చెప్పారు.
భారతదేశం లోని గ్రామీణ ప్రాంతాల లో 2 కోట్లకు పైగా హౌసింగ్ యూనిట్ లను నిర్మించడం జరిగిందని కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. ఈ సంవత్సరం లో గ్రామీణ ప్రాంతాలలో గృహనిర్మాణ వేగాన్ని పెంచే దిశ లో ప్రయత్నం జరుగుతుందని ఆయన అన్నారు.
***
Leveraging latest technologies to ensure #Housing4All. https://t.co/qHrKKdCGBJ
— Narendra Modi (@narendramodi) January 1, 2021