ప్రపంచం లో అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం అయినటువంటి ‘ఆయుష్మాన్ భారత్ పిఎమ్ జెఎవై’ మూడు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.
మైగవ్ఇండియా (MyGovIndia) కు ప్రధాన మంత్రి ఇచ్చిన ఒక సమాధానం లో–
‘‘ఆరోగ్య సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని గడచిన సంవత్సరం లో మరింత స్పష్టం గా అర్థం చేసుకోవడం జరిగింది.
మన పౌరుల కు అగ్రగామి నాణ్యత కలిగిన మరియు తక్కువ ఖర్చు తో కూడిన ఆరోగ్య సంరక్షణ కు పూచీ పడాలి అన్నదే మా వాగ్దానం గా ఉంది. ఈ దార్శనికత ను సాకారం చేయడం లో ఆయుష్మాన్ భారత్ పిఎమ్ జెఎవై పాత్ర కీలకం. #3YearsofPMJAY’’ అని పేర్కొన్నారు.
***
The importance of healthcare has been even more clearly understood in the year gone by.
— Narendra Modi (@narendramodi) September 23, 2021
It is our commitment to ensure top quality and affordable healthcare for our citizens. Ayushman Bharat PM-JAY is key to realising this vision. #3YearsofPMJAY https://t.co/NHKWgTYsY5