Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆయుష్మాన్భారత్ డిజిటల్ మిశన్  ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

ఆయుష్మాన్భారత్ డిజిటల్ మిశన్  ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్ డిజిట్ మిశన్ ను ఈ రోజు న ఒక వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.

ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఆరోగ్య సదుపాయాల ను పటిష్ట పరచేందుకు గత ఏడు సంవత్సరాలు గా సాగుతున్న ఉద్యమం ఈ రోజు న ఒక కొత్త దశ లో ప్రవేశిస్తోందన్నారు. ‘‘భారతదేశం లో ఆరోగ్య సదుపాయాల లో ఒక క్రాంతికారి మార్పు ను తీసుకు వచ్చే సత్తా కలిగినటువంటి ఒక మిశన్ ను మనం ఈ రోజు న ప్రారంభించుకొంటున్నాం’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

130 కోట్ల ఆధార్ సంఖ్య లు, 118 కోట్ల మంది మొబైల్ చందాదారులు, దాదాపు 80 కోట్ల మంది ఇంటర్ నెట్ వినియోగదారులు, సుమారు 43 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతా లు.. ఇంతగా సంధానం అయినటువంటి మౌలిక సదుపాయాల వ్యవస్థ ప్రపంచం లో ఎక్కడా కూడా లేదు అనేది యథార్థం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అనేది ఆహార పదార్థాలు మొదలుకొని పాలన యంత్రాంగం వరకు ప్రతి దాని ని భారతదేశం లోని సామాన్యుల చెంత కు వేగం గాను, పారదర్శకమైన పద్ధతి లోను చేర్చుతోంది అని ఆయన అన్నారు. ‘‘ప్రస్తుతం పరిపాలన సంబంధి సంస్కరణల లో సాంకేతిక విజ్ఞానాన్ని మోహరిస్తున్న తీరు ఇంతకు ముందు ఎన్నడూ ఎరుగని విధంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

కరోనా సంక్రమణ విస్తరణ ను అడ్డుకోవడం లో ఆరోగ్య సేతు ఏప్ఎంతగానో తోడ్పడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం భారతదేశం సుమారు 90 కోట్ల వ్యాక్సీన్ డోజుల ను ఇప్పించి, ఒక రికార్డు ను నెలకొల్పడం లో కో-విన్’ (Co-WIN) పోషించిన పాత్ర ను ఆయన ప్రశంసించారు.

టెలిమెడిసిన్ సేవలు కూడా కరోనా కాలం లో అపూర్వమైన రీతి లో విస్తరించాయి. ఇంతవరకు ఇ-సంజీవని ద్వారా దాదాపు గా 125 కోట్ల రిమోట్ కన్ సల్టేశన్స్ పూర్తి అయ్యాయి అని ప్రధాన మంత్రి వివరించారు. ఈ సదుపాయం దేశం లోని దూర, సుదూర ప్రాంతాల లో నివసిస్తున్నటువంటి వేల కొద్దీ దేశ వాసుల ను వారి ఇళ్ల లో నుంచే నగరాల లో పెద్ద పెద్ద ఆసుపత్రుల వైద్యుల తో జోడిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

ఆయుష్మాన్ భారత్-పిఎంజెఎవై పేదల జీవితాల లో ఒక ప్రధానమైన సమస్య ను తీర్చింది అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఇంతవరకు 2 కోట్ల మంది కి పైగా దేశవాసులు ఈ పథకం లో భాగం గా ఉచిత వైద్య చికిత్స సదుపాయాన్ని వినియోగించుకున్నారని, వారిలో సగం మంది మహిళలే అని ఆయన తెలిపారు. కుటుంబాలు పేదరికం విషవలయం లో చిక్కుకోవడానికి కీలకమైన ఒక కారణం ఏదీ అంటే, అది వ్యాధులు; కుటుంబాల లోని మహిళలు వారి ఆరోగ్య సమస్యల ను ఉపేక్షిస్తూ తీవ్ర బాధితులు గా మిగిలిపోతున్నారు అని ఆయన అన్నారు. ఆయుష్మాన్ తాలూకు లబ్ధిదారుల లో కొంత మంది తో స్వయం గా భేటీ అయ్యేందుకు తాను చొరవ తీసుకొన్నట్లు, ఆ భేటీ లలో ఈ పథకం తాలూకు ప్రయోజనాల ను గురించి తాను గ్రహించగలిగినట్లు ఆయన చెప్పారు. ‘‘ఈ ఆరోగ్య సంరక్షణ సంబంధి పరిష్కారాలు దేశాని కి వర్తమానం లోను, భవిష్యత్తు లోను ఒక పెద్ద పెట్టుబడి గా నిలుస్తాయి’’ అని ఆయన అన్నారు.

ఆయుష్మాన్ భారత్-డిజిటల్ మిశన్ ఇక మీదట దేశవ్యాప్తం గా ఆసుపత్రుల లోని డిజిటల్ హెల్థ్ సల్యూశన్స్ ను ఒకదానితో మరొకదానిని జోడిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మిశన్ ఆసుపత్రుల లో ప్రక్రియల ను సులభతరం గా మార్చివేయడం ఒక్కటే కాకుండా జీవించడం లో సౌలభ్యాన్ని కూడా పెంచుతుంది అని ఆయన తెలిపారు. దీని లో భాగం గా, దేశం లోని ప్రతి ఒక్కరు ఇకపై ఒక డిజిటల్ హెల్థ్ ఐడి ని అందుకొంటారని, మరి వారి హెల్థ్ రికార్డు ను డిజిటల్ మాధ్యమం లో భద్రపరచడం జరుగుతుందని ప్రధాన మంత్రి వివరించారు.

భారతదేశం సమగ్రమైన, అందరి ని కలుపుకొని పోయేటటువంటి ఒక హెల్థ్ మాడల్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ మాడల్ నివారణ ప్రధానమైనటువంటి ఆరోగ్య సంరక్షణ కు పెద్ద పీట వేస్తుంది. అదే కాలం లో వ్యాధి బారిన పడిన పక్షం లో, సులభమైనటువంటి తక్కువ ఖర్చు తో కూడినటువంటి ఇట్టే అందుబాటు లో ఉండేటటువంటి వైద్య చికిత్స కు కూడా దీనిలో ప్రాధాన్యం ఉంటుంది అని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సంబంధి విద్య లో ఇదివరకు ఎరుగనటువంటి సంస్కరణల ను గురించి కూడా ఆయన చర్చించారు. గడచిన 7-8 సంవత్సరాల తో పోలిస్తే ప్రస్తుతం భారతదేశం లో మరింత ఎక్కువ సంఖ్య లో డాక్టర్ లను, పారా మెడికల్ మేన్ పవర్ ను తీర్చిదిద్దడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ఒక సమగ్రమైనటువంటి ఎఐఐఎమ్ఎస్ తో పాటు, ఇతర ఆధునిక ఆరోగ్య సంస్థల నెట్ వర్క్ ను దేశం లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతి మూడు లోక్ సభ నియోజక వర్గాల పరిధి లో ఒక వైద్య కళాశాల చొప్పున స్థాపించేందుకు కృషి జరుగుతోంది అని ఆయన చెప్పారు. గ్రామాల లో ఆరోగ్య సదుపాయాల ను పటిష్ట పరచడం గురించి కూడా ఆయన వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నెట్ వర్క్ లను, వెల్ నెస్ సెంటర్ లను బలోపేతం చేయడం జరుగుతోందన్నారు. ఆ తరహా కేంద్రాల ను 80,000 కు పైగా ఇప్పటికే పని చేయించడం ప్రారంభించడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఈ నాటి కార్యక్రమాన్ని ప్రపంచ పర్యటన దినం నాడు నిర్వహించుకోవడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి ప్రస్తావించి, పర్యటన కు ఆరోగ్యం తో చాలా బలమైన సంబంధం ఉంది అన్నారు. ఇలా ఎందుకంటే, ఎప్పుడైతే మన ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాల వ్యవస్థ ను ఏకీకరించడం, బలపరచడం జరుగుతుందో అప్పుడు అది పర్యటన రంగాని కి కూడా మెరుగులు దిద్దుతుంది అని ఆయన చెప్పారు.

 

 

बीते सात वर्षों में, देश की स्वास्थ्य सुविधाओं को मजबूत करने का जो अभियान चल रहा है, वो आज से एक नए चरण में प्रवेश कर रहा है।

आज एक ऐसे मिशन की शुरुआत हो रही है, जिसमें भारत की स्वास्थ्य सुविधाओं में क्रांतिकारी परिवर्तन लाने की ताकत है: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

130 करोड़ आधार नंबर, 118 करोड़ mobile subscribers, लगभग 80 करोड़ internet user, करीब 43 करोड़ जनधन बैंक खाते इतना बड़ा connected infrastructure दुनिया में कहीं नही है।

ये digital infrastructure राशन से लेकर प्रशासन तक को तेज, पारदर्शी तरीके से सामान्य भारतीय तक पहुंचा रहा है: PM

— PMO India (@PMOIndia) September 27, 2021

आरोग्य सेतु ऐप से कोरोना संक्रमण को फैलने से रोकने में बहुत मदद मिली।

सबको वैक्सीन, मुफ्त वैक्सीन अभियान के तहत भारत आज करीब-करीब 90 करोड़ वैक्सीन डोज लगा पाया है तो इसमें Co-WIN का बहुत बड़ा रोल है: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

कोरोना काल में टेलिमेडिसिन का भी अभूतपूर्व विस्तार हुआ है।

ई-संजीवनी के माध्यम से अब तक लगभग सवा करोड़ रिमोट कंसल्टेशन पूरे हो चुके हैं।

ये सुविधा हर रोज़ देश के दूर-सुदूर में रहने वाले हजारों देशवासियों को घर बैठे ही शहरों के बड़े अस्पतालों के डॉक्टरों से कनेक्ट कर रही है: PM

— PMO India (@PMOIndia) September 27, 2021

आयुष्मान भारत- PM JAY ने गरीब के जीवन की बहुत बड़ी चिंता दूर की है।

अभी तक 2 करोड़ से अधिक देशवासियों ने इस योजना के तहत मुफ्त इलाज की सुविधा का लाभ उठाया है।

इसमें भी आधी लाभार्थी, हमारी माताएं, बहनें, बेटियां हैं: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

आयुष्मान भारत- डिजिटल मिशन, अब पूरे देश के अस्पतालों के डिजिटल हेल्थ सोल्यूशंस को एक दूसरे से कनेक्ट करेगा।

इसके तहत देशवासियों को अब एक डिजिटल हेल्थ आईडी मिलेगी।

हर नागरिक का हेल्थ रिकॉर्ड डिजिटली सुरक्षित रहेगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

अब भारत में एक ऐसे हेल्थ मॉडल पर काम जारी है, जो होलिस्टिक हो, समावेशी हो।

एक ऐसा मॉडल, जिसमें बीमारियों से बचाव पर बल हो,- यानि प्रिवेंटिव हेल्थकेयर, बीमारी की स्थिति में इलाज सुलभ हो, सस्ता हो और सबकी पहुंच में हो: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

भारत के हेल्थ सेक्टर को ट्रांसफॉर्म करने के लिए मेडिकल एजुकेशन में भी अभूतपूर्व रिफॉर्म्स हो रहे हैं।

7-8 साल में पहले की तुलना में आज अधिक डॉक्टर्स और पैरामेडिकल मैनपावर देश में तैयार हो रही है: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

एक संयोग ये भी है कि आज का ये कार्यक्रम वर्ल्ड टूरिज्म डे पर आयोजित हो रहा है।

कुछ लोग सोच सकते हैं कि हेल्थ केयर के प्रोग्राम का टूरिज्म से क्या लेना देना? – PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

लेकिन हेल्थ का टूरिज्म के साथ एक बड़ा मजबूत रिश्ता है।

क्योंकि जब हमारा हेल्थ इंफ्रास्ट्रक्चर इंटीग्रेटेड होता है, मजबूत होता है, तो उसका प्रभाव टूरिज्म सेक्टर पर भी पड़ता है: PM @narendramodi

— PMO India (@PMOIndia) September 27, 2021

***

DS/AK