ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆధునికీకరించిన ఎలక్ర్టానిక్స్ తయారీ క్లస్టర్ల (ఇఎంసి 2.0) స్కీమ్ కు ఆర్థిక సహాయానికి ఆమోదముద్ర వేసింది. ఇఎంసిల్లో ప్రపంచ శ్రేణి ఉమ్మడి సదుపాయాలు,వసతుల అభివృద్ధికి ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అందచేస్తారు. ఇఎంసిలు దేశంలో ఇఎస్ డిఎం సెక్టార్ వృద్ధికి దోహదపడడంతో పాటు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు కావడానికి, ఇన్నోవేషన్ అభివృద్ధికి, ఆ రంగంలో పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని ఉత్తేజితం చేయడానికి, ఉపాధి అవకాశాలు, పన్ను ఆదాయాల పెరుగుదలకు దోహదపడుతుంది.
ఎలక్ర్టానిక్ తయారీ క్లస్టర్లు (ఇఎంసి), ఉమ్మడి సదుపాయాల సెంటర్లు (సిఎఫ్ సి) ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు ఈ స్కీమ్ అందచేస్తుంది. ఇఎస్ డిఎం యూనిట్ల ఏర్పాటుకు అవసరం అయిన మౌలికవసతులు, సదుపాయాలు, ఇతర ఉమ్మడి సదుపాయాల ఏర్పాటు కోసం తక్కువ విస్తరణ గల నిర్దేశిత భౌగోళిక ప్రదేశాలను ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి సదుపాయాల సెంటర్లు (సిఎఫ్ సి) ఏర్పాటు చేయడానికి సంబంధిత ప్రదేశంలో నిర్దిష్ట సంఖ్యలో ఇఎస్ డిఎం సెంటర్లు పని చేస్తూ ఉండాలి. అలాంటి ఇఎంసిలు, పారిశ్రామిక ప్రాంతాలు, పార్కులు, పారిశ్రామిక కారిడార్లలో ఉమ్మడి సాంకేతిక మౌలిక వసతుల మెరుగుదలకు, ఉమ్మడి సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి.
ఆర్థిక భారం
ఇఎంసి 2.0 స్కీమ్ కు మొత్తం పెట్టుబడి రూ.3762.25 కోట్లు. ఇందులో రూ.3725 కోట్లు ఆర్థిక సహాయం కాగా రూ.37.25 కోట్లు పాలనాపరమైన ఖర్చులు ఉంటాయి. ఎనిమిది సంవత్సరాల కాలం ఈ స్కీమ్ విస్తరిస్తుంది.
ప్రయోజనాలు
ఈ స్కీమ్ ద్వారా ఇఎస్ డిఎం రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు, ఉపాధి అవకాశాల పెంపునకు వీలుగా ఎలక్ర్టానిక్ పరిశ్రమకు అవసరం అయిన విస్తారమైన మౌలిక వసతులు ఏర్పాటవుతాయి. దీని వల్ల ఈ దిగువ ప్రయోజనాలుంటాయి.
i.ఎలక్ర్టానిక్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు రెడీగా ఉపయోగించుకోగల మౌలిక వసతులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
ii. ఎలక్ర్టానిక్స్ రంగంలోకి కొత్త పెట్టుబడులు వస్తాయి.
iii.తయారీ యూనిట్ల ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది.
iv. తయారీ యూనిట్లు చెల్లించే పన్నుల ద్వారా ఆదాయాలు వస్తాయి.
పూర్వాపరాలు…
ఎలక్ర్టానిక్స్ తయారీకి అవసరం అయిన మౌలికవసతులతో కూడిన వాతావరణం కల్పించేందుకు ఎలక్ర్టానిక్స్, ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ ను నోటిఫై చేసింది.2017 అక్టోబర్ వరకు ఈ స్కీమ్ దరఖాస్తులకు తెరిచి ఉంది. అనుమతించిన ప్రాజెక్టులకు నిధుల అందించడానికి 5 సంవత్సరాల కాలపరిమితి (2022 అక్టోబర్ వరకు) నిర్దేశించారు. ఇఎంసి స్కీమ్ కింద దేశంలోని 15 రాష్ర్టాల్లో 3565 ఎకరాల విస్తీర్ణంలో రూ.3898 కోట్ల ప్రాజెక్టు వ్యయం, రూ.1577 కోట్ల ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో 20 కొత్త ఇఎంసిలు. 3 సిఎంసిలు ఏర్పాటవుతాయి.
దేశంలో ఎలక్ర్టానిక్స్ పరిశ్రమకు అవసరం అయిన మౌలిక వసతులు మరింతగా బలోపేతం చేయడానికి, ఎలక్ర్టానిక్ విలువ ఆధారిత వ్యవస్థ మరింత లోతుగా పాతుకునేందుకు సహాయపడడానికి ఆ స్కీమ్ ను ఆధునికీకరించి కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది.
2014-15 సంవత్సరంలో ఎలక్ర్టానిక్స్ ఉత్పత్తి రూ.1,90,366 కోట్లుండగా (2900 కోట్ల అమెరికన్ డాలర్లు) 2018-19 నాటికి 25 శాతం వార్షిక వృద్ధిరేటుతో (సిఎజిఆర్) రూ.4,58,006 (7000 కోట్ల అమెరికన్ డాలర్లు) పెరిగింది. ప్రపంచంలో ఎలక్ర్టానిక్స్ తయారీలో భారతదేశం వాటా 2012లో 1.3 శాతం ఉండగా 2018 నాటికి 3 శాతానికి పెరిగింది. భారత జిడిపిలో ఈ రంగం వాటా 2.3 శాతం ఉంది.
****